దారుణంగా తండ్రి కొడుకుల హత్య

Samajwadi Party leader, son, shot dead in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ లోని సంబల్ జిల్లాలో సమాజ్ వాదీ పార్టీ నేత అతని కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు.
జిల్లాలోని శ్యామ్మోయి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి చెందిన దివాకర్ పొలాల్లో గుంతలు తవ్వుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దివాకర్ తన కొడుకు సునీల్ తో సహా అక్కడికి చేరుకున్నాడు. తమ పొలంలో గుంతలు ఎందుకు తవ్వుతున్నారని అడిగారు. దీంతో అక్కడున్న ఇద్దరు వ్యక్తులు ఈ తండ్రికొడుకులతో వాగ్వాదానికి దిగారు.
గుంతలు తవ్వుతున్న వ్యక్తులు అప్పటికే నాటు తుపాకులతో తండ్రీ కొడుకులను బెదిరించారు. అయినప్పటికీ తండ్రీకొడుకులు వారితో గొడవకు దిగారు. దీంతో ఇద్దరు దుండగులు తండ్రి కొడుకులపై కాల్పులు జరిపారు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఘటన స్థలిలోనే మరణించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.