Home » సీత రామం తరవాత కూడా మృణాల్ బిజీ హీరోయిన్ అవ్వలేదు ఎందుకు..?

సీత రామం తరవాత కూడా మృణాల్ బిజీ హీరోయిన్ అవ్వలేదు ఎందుకు..?

by Sravya
Ad

మృణాల్ ఠాకూర్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మృణాల్ చిన్న వయసులో నటించాలని కోరిక తో ఉండేవారు. కానీ కుటుంబం నుండి ఉన్న కొన్ని కండిషన్స్ కారణంగా సినీ ఇండస్ట్రీకి కాకుండా ముందు టెలివిజన్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత అందర్నీ ఒప్పించి ఇండస్ట్రీలోకి నెమ్మదిగా వచ్చారు. దూల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతా రామం మూవీ తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు టాలీవుడ్ లో మారు మోగిపోయింది. ఆమె గురించి అందరికీ తెలిసింది.

Advertisement

ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది కూడా. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చాలా పెద్ద హీరోయిన్ అయిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండియా ద్వారా గుర్తింపు పొందితే పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ చేయొచ్చు అని కళలు కూడా కన్నారు, అనుకున్నట్లుగా హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు హాయ్ నాన్న మూవీ పరవాలేదు అనిపించినా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె కెరియర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది.

Also read:

Advertisement

Also read:

ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో ఏ ఒక్క మూవీలో కూడా నటించట్లేదు హిందీలో ఒక సినిమా చేస్తున్నా తెలుగు సినిమా మేకర్స్ మాత్రం ఈమె వైపు చూడట్లేదు. ఫ్యామిలీ స్టార్ పరాజయం కూడా ఆమె కెరియర్ మీద గట్టిగానే ప్రభావం చూపించింది. సీతారామం వంటి ఒక అద్భుతమైన మూవీలో నటించిన ఈమె తెలుగులో ఇంత తొందరగా కెరీయర్ ను ముగించేస్తుందా అంటే అదే జరిగేటట్టు వుంది. అందుకని మోడలింగ్ అని ఫోటోషూట్స్ అని హాట్ షూట్స్ అని అభిమానులకి దగ్గరగా ఉంటోంది. మరి ఈమె కష్టాన్ని చూసి ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అవుతుందా లేదంటే హిందీలోకి వెళ్లిపోయి అక్కడ నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading