Home » నాని కోసమే కథ రెడీ చేసిన బలగం వేణు..!

నాని కోసమే కథ రెడీ చేసిన బలగం వేణు..!

by Sravya
Ad

వేణు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కమెడియన్ గా వేణు అందరికీ సుపరిచితమే. తర్వాత దర్శకుడుగా అవతారం ఎత్తారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. అందుకోసం ఎంతగానో శ్రమిస్తారు. అయితే కొంతమంది డైరెక్టర్లు మంచి పేరు తెచ్చుకుని టాప్ డైరెక్టర్ గా మారిపోతే కొంతమంది మాత్రం ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. కొన్ని సినిమాలు తర్వాత ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు.

Advertisement

ఈ క్రమంలోనే కొంతమంది దర్శకులు చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళలో దర్శకుడు వేణు ఒకరు. ఈయన చేసిన బలగం సినిమా సూపర్ సక్సెస్ అయింది. పైగా ప్రేక్షకులు ఈ మూవీకి బాగా కనెక్ట్ అయిపోయారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని చూసి సొంత ఇంట్లో ఎలాంటి పరిణామాలు అయితే ఎదురయ్యాయో అవన్నీ కూడా తను ఓన్ చేసుకొని మూవీ ని అందించారు అందువలన ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది.

Advertisement

Also read:

ఇప్పుడు ఆయన నానిని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. వేణు ఈ కథ రాసుకున్నప్పుడు నాని ని దృష్టిలో పెట్టుకుని కథను తయారు చేసుకున్నారు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథగా దీన్ని రెడీ చేశారు. ఈ సినిమాతో వేణు సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోవచ్చని అంతా అంటున్నారు. మొత్తానికి వేణు ఒక నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం డైరెక్టర్ గా తన రేంజ్ ని విస్తరించుకున్నారు అని చెప్పొచ్చు. నాని మూవీ తో కనుక సూపర్ సక్సెస్ అందుకుంటే తను తప్పకుండా స్టార్ట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉంటారని అంతా భావిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading