Home » రోజుకి 9 షోలతో దూసుకుపోయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిరంజీవి సినిమా ! ఈ రికార్డు మరొకరు కొట్టగలరా ?

రోజుకి 9 షోలతో దూసుకుపోయి బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిరంజీవి సినిమా ! ఈ రికార్డు మరొకరు కొట్టగలరా ?

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, చిరంజీవి ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు మంచి పేరు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేస్తూ దూసుకు వెళ్ళిపోతున్నారు. 150 కి పైగా సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా కుర్ర హీరోలకి పోటీగా నిలుస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ తో బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ మాస్ ఇమేజ్ కి కేర్ ఆఫ్ గా నిలిచిన సినిమా ముఠామేస్త్రి. ఈ సినిమాను ఇప్పుడు కూడా టీవీలో అందరూ చూస్తూ ఉంటారు.

Advertisement

Also read:

చిరు ఫ్యాన్స్ కి మాస్ ప్రేక్షకులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ ఇచ్చింది. ముఠామేస్త్రి మూవీ పూనకాలు తెప్పించింది అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఘరానా మొగుడు సినిమా తర్వాత ఆపద్బాంధవుడు సినిమాలో నటించారు చిరంజీవి. కోదండరామి రెడ్డి, చిరు కాంబినేషన్లో వచ్చిన ఆఖరి సినిమా ముఠామేస్త్రి. ఇందులో రోజా, మీనా హీరోయిన్స్ గా నటించారు. బడ్జెట్ ఎక్కువవుతుందని ఇంకో నిర్మాతని కూడా లైన్లో పెట్టారు. అలా చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్లో ముఠామేస్త్రి సినిమా మొదలు అయ్యింది.

Advertisement

Also read:

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారు అందుకని ముఠామేస్త్రి సినిమా చేస్తున్నారు అని రూమర్స్ కూడా వచ్చాయి.. మూవీ సెన్సార్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఇలా ఎట్టకేలకు సినిమా వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ కానీ చిరంజీవి నటన కానీ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమాని ఎన్నిసార్లైనా చూడొచ్చు అన్న భావన అందరికీ కలిగింది పెద్ద హిట్ ని అందుకుంది. టాలీవుడ్లో వన్ అఫ్ ది మోస్ట్ బెస్ట్ మసాలా మూవీ గా నిలిచిపోయింది ముఠామేస్త్రి. 200 థియేటర్లలో ఈ సినిమాని వేశారు అయితే మొదటి రోజు కాకినాడ దేవి థియేటర్ లో తొమ్మిది షోలు వేశారు. మొదటివారం కోటిన్నర షేర్ లని కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డ్ గా నిలిచిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading