నేపాల్ లో కరోనా కలకలం

corona increased in nepal

నేపాల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రోజుకు ఒకటి, రెండు కొత్త కేసులు నమోదవుతూ కేసుల సంఖ్య నిదానంగా పెరిగినా.. ఇప్పుడు మాత్రం రోజుకు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 
దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 250 మార్కును దాటి 258కి చేరింది. నేపాల్‌ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది. కొత్త కేసులు తొమ్మిది బాంకీ జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. వారిలో 8 మంది నారాయిన్‌పూర్‌ గ్రామీణ మున్సిపాలిటీకి చెందినవారు కాగా, ఒకరు మక్వాన్‌పూర్‌కు చెందిన వారని అధికారులు ప్రకటించారు.