జమ్ములో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదుల హతం

Updated By ManamMon, 06/18/2018 - 13:02
encounter

encounter శ్రీనగర్/జమ్ము: జమ్ముకశ్మీర్‌లోని బందిపోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. ప్రస్తుతం వారి మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులపై భారత భద్రతా బలగాలు సోమవారం ఉదయం నుంచి ఆపరేషన్‌ చేస్తున్నాయని, ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారని, వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఆర్మీకి చెందిన ఓ అధికారి తెలిపాడు. అయితే రంజాన్ మాసం సందర్భంగా నెలరోజుల పాటు జమ్ముకశ్మీర్‌లో కాల్పుల విరమణ ఒప్పందానికి ఊరటను ఇచ్చారు. ఇటీవలే రంజాన్ పండుగ కూడా ముగియడంతో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతాదళ కార్యకలాపాలు మళ్లీ మొదలవుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

English Title
4 Terrorists killed in Jammu Kashmir encounter
Related News