వీడియో: కొండచిలువతో సెల్ఫీ.. పీక నొక్కేసింది..

Updated By ManamMon, 06/18/2018 - 16:18
Selfie Fail, Python Caught, Ranger Sanjay datta

Selfie Fail, Python Caught, Ranger Sanjay dattaజల్పాయిగురి: కొండచిలువతో ఫొటోలకు ఫోజిస్తూ ఓ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. రోజూ చూసే జీవాలే కదా అన్న నిర్లక్ష్యమో లేక ఇంతకుముందే ప్రాణాపాయంలో ఉన్న దానిని రక్షించా కదా అన్న భావనే తెలియదు కానీ ఆ కొండచిలువను మెడలో వేసుకున్నాడు. చుట్టూ ఉన్న స్థానికులతో పాటు ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నాడు. కొంతసేపటి వరకూ అంతా బాగానే ఉంది.. ఆ తర్వాత ఈ హడావిడి చూసి కొండచిలువకు చిర్రెత్తుకొచ్చిందేమో! అప్పటికే సదరు రేంజర్ చేతులకు చుట్టుకున్న తన శరీరాన్ని మరింత ఒత్తిడి పెంచసాగింది. శత్రువును తుదముట్టించేందుకు మిగతా పాములలాగా కొండచిలువ విషాన్ని నమ్ముకోదు. శత్రువును చుట్టేసి ఒత్తిడి పెంచుతూ నిర్వీర్యం చేస్తుంది. ఈ క్రమంలో కొద్దికొద్దిగా పట్టు బిగుస్తుండడంతో రేంజర్‌కు దాని ప్రభావం తెలిసొస్తోంది.

నొప్పిని భరించలేక రేంజర్ కేకలు వేయడంతో చుట్టూ ఉన్న వారు బలవంతంగా కొండచిలువను వేరుచేసి రేంజర్‌ను రక్షించారు. ఈ మొత్తం ప్రహసనం ముగిసే సరికి సదరు రేంజర్ చావు అంచుల్లోకి వెళ్లొచ్చాడు. జల్పాయిగురిలోని బైకంతపూర్ అటవీ పరిధిలో జరిగిన ఈ ఘటనలో కొద్దిలో ప్రాణాపాయం తప్పించుకున్న ఆ రేంజర్ పేరు సంజయ్ దత్తా! ప్రమాదకర జంతువులతో ఫొటోలు దిగడం ఎంత ప్రమాదమో ఇప్పుడు తనకు తెలిసొచ్చిందని దత్తా అంటున్నారు. 

English Title
Selfie Fail With Python Caught On Camera
Related News