క్రికెటర్ పాత్ర‌లో ర‌ష్మిక 

Updated By ManamWed, 05/16/2018 - 16:49
rashmika

rashmikaయూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డెబ్యూ డైరెక్టర్ భరత్ కమ్మ డైరెక్షన్‌లో ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న‌ ఈ సినిమాలో ‘ఛలో’ ఫేమ్ రష్మిక మందన్న కథానాయికగా నటించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ మూవీలో రష్మిక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కనిపించనున్నార‌ని తెలిసింది. అంతేగాకుండా..  ఈ సినిమా కోసం హైదరాబాద్‌ క్రికెట్ అకాడమీలో గ‌త కొంత‌కాలంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నార‌ని స‌మాచారం.  తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా.. విజయ్, రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. అంతేగాకుండా.. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీలోనూ నాని సరసన నటిస్తోంది రష్మిక.

English Title
rashmika as cricketerRelated News