తెలంగాణలో కూటమి వైపే!

 lagadapati rajagopal survey predicts congress prajakutami win victory
  • తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం

  • లగడపాటి రాజగోపాల్ అంచనా

  • కూటమికి 65 స్థానాలని వెల్లడి

  • టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితం

  • బీజేపీ, మజ్లిస్, స్వతంత్రులు తలో 7

  • ఈసారి జోరందుకున్న ప్రలోభాలు 

  • అన్ని పార్టీలకూ పెరిగిన ఖర్చులు

హైదరాబాద్, డిసెంబరు 7: తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉందని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. తన మిత్రులతో కలిసి చేసిన సర్వే, ఎగ్జిట్‌పోల్స్ వివరాలను ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాకూటమికి మొత్తమ్మీద 65 స్థానాలు (+/- 10) రావచ్చని ఆయన అంచనా వేశారు. టీఆర్‌ఎస్‌కు 35 స్థానాలు (+/- 10) రావచ్చని తెలిపారు. విడిగా చూసినపుడు.. టీడీపీ 13 స్థానాలలో పోటీచేసింది.

వాటిలో మలక్‌పేట స్థానంలో మజ్లిస్ పోటీ ఉండటం వల్ల దాన్ని వదిలేయాలని చెప్పారు. రెండుచోట్ల ఇండిపెండెంట్లు గెలుస్తారని.. మిగిలిన పదిస్థానాలకు గాను 7 స్థానాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అంటే సుమారుగా పోటీ చేసిన స్థానాలలో సగం వరకు టీడీపీకి దక్కొచ్చని ఆయన చెప్పారు. అలాగే బీజేపీకి 7 స్థానాల వరకు, మజ్లిస్ పార్టీకి 6-7 స్థానాలు దక్కొచ్చని, స్వతంత్రులు ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉందని లగడపాటి తెలిపారు. సీపీఎం (బీఎల్‌ఎఫ్) ఒకచోట గెలవచ్చని వివరించారు. ఆర్జీ ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు పలు దఫాలుగా తెలంగాణ ప్రజల నాడి, మనోభావాలు, వారి మొగ్గును అంచనా వేశామన్నారు.

కనీసం 72 శాతం వరకు పోలింగ్ నమోైదెనట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయని, ఇది మరికాస్త పెరగచ్చని, దాన్ని బట్టి చూస్తే ప్రజాకూటమి విజయం సాధించే అవకాశాలు ఎక్కువవుతాయని అన్నారు. చివరి రెండు రోజుల్లో చాలా ప్రయుత్నాలు జరిగాయని... గతంలో లేని విధంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖర్చు బాగా పెంచారని తెలిపారు. మునుపెన్నడూ లేని స్థాయిలో ఖర్చు చేశారని చెప్పారు. సాధారణంగా తెలంగాణ ఎన్నికలంటే ఖర్చు కాస్త తక్కువని గతంలో భావించేవారని, కానీ ఈసారి మాత్రం దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను భారీగా ప్రలోభాలకు గురిచేశారని వివరించారు. అందువల్ల అందరికీ ఖర్చు ఎక్కువే అయ్యిందన్నారు. 

జాతీయ మీడియా తప్పు
జాతీయ మీడియా చానళ్లు చెప్పిన అంశాలు ఇప్పటికే మూడు రాష్ట్రాలలో తప్పయ్యాయని, అందుకు ప్రధాన కారణం డబ్బు, ఇతర ప్రలోభాల ప్రభావవేునని రాజగోపాల్ వివరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో.. అంటే దక్షిణ భారతాన్ని ప్రత్యేకకోణంలో చూడాలని అన్నారు. ఈ రాష్ట్రాలకు సంబంధించి గతంలో వారిచ్చిన అంచనాలు తలకిందులు అయ్యాయని గుర్తుచేశారు. ఇంతకుముందు తమిళనాడు, కర్ణాటక విషయాలలో తాను చెప్పిన విషయాలే నిజమయ్యాయున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే, కర్ణాటకలో బీజేపీ వస్తాయని తాను అన్నానన్నారు. 

సంబంధిత వార్తలు