లైంగిక వేధిపుల కేసు: లొంగిపోయిన నిర్మాత 

Updated By ManamSat, 05/26/2018 - 10:29
harvey

Harvey  హాలీవుడ్ తారలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ శుక్రవారం న్యూయార్క్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఉదయాన్నే స్టేషన్‌కు వచ్చిన వెయిన్ స్టీన్ తమ దగ్గర లొంగిపోయారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత అతడిని కోర్టులో హాజరు పరచగా, రూ.6.7కోట్ల పూచీకత్తుతో కోర్టు హార్వీకి బెయిల్‌ను మంజూరు చేసింది.

అయితే హార్వీ తమను లైంగికంగా వేధించాడని ప్రముఖ నటీనటులు ఏంజెలినా జోలీ, సల్మా హయక్ సహా 80మందికిపైగా అతడిపై ఆరోపణలు చేశారు. కానీ వీన్‌స్టీన్ వాటిని ఖండిస్తూ వచ్చాడు. తాను ఎవరినీ లైంగికంగా వేధించలేదని ఆయన చెబుతూ వచ్చాడు. అయితే తాజాగా స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోవడం గమనర్హం.

English Title
Harvey Weinstein, Hollywood producer, arrested on rape, sex abuse charges
Related News