Home » బాలయ్యలోని ఆ యాంగిల్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చూపిస్తాడా ?

బాలయ్యలోని ఆ యాంగిల్ ని దర్శకుడు అనిల్ రావిపూడి చూపిస్తాడా ?

by Anji
Ad

టాలీవుడ్ లో నందమూరి నటవారసుడిగా, నటసింహం బాలకృష్ణ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రకాల సినిమాలు చేసిన హీరోగా ఈయనకు మంచి రికార్డు ఉంది. దాదాపు బాలయ్య గత 20 ఏళ్ల నుంచి ఒకేరకమైన మూస ధోరణి సినిమాలను చేస్తున్నాడనే విషయం తెలిసిందే. అందులోంచి అప్పుడప్పుడూ అప్డేట్ అయి ఇప్పటి ట్రెండ్ కి తగినట్టు బాలయ్యతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. 

Advertisement

గత రెండు దశాబ్దాల్లో బాలయ్య 25 కి పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం ఐదు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో బోయపాటి సినిమాలు మూడు ఉండటం విశేషం. బాలయ్యతో మూవీస్ చేసే ఏ దర్శకుడు అయినా బాలకృష్ణ ఇమేజ్ కి తగినట్టు స్క్రిప్ట్ చేంజ్ చేసేవారు. కానీ బాలయ్యలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇన్ని ఫ్లాప్ లకి ఇది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎంతో కొంత పూరి జగన్నాథ్ అయితే తన స్టైల్ లో పైసావసూల్ మూవీలో  కొత్తగా చూపించాడు. కానీ ఆ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ఇప్పుడు చాలా రోజుల తరువాత మళ్లీ మాస్ దర్శకుడితో కాకుండా కామెడీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తున్న భగవంత్ కేసరి టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Bhagavanthkesari

ఇది కూడా మాస్ సినిమానే అని తెలుస్తోంది. కానీ చాలా మంది సినీ లవర్స్ కి బాలయ్యని కామెడీ యాంగిల్ లో చూడాలని కోరిక ఉంటుంది. అప్పుడెప్పుడో 30 ఏళ్ల కిందట టాప్ హీరో మూవీలో బాలయ్య ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేశాడు. ఇప్పుడు అనిల్ రావిపూడికి ఆ ఛాన్స్ వచ్చిందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమా చూస్తుంటే మాత్రం అలా అస్సలు కనిపించడం లేదు. ఒక కామెడీ స్కిట్ ఎపిసోడ్ అయినా ఆ మూవీలో చేయిస్తే బాగుంటుందని కొంత మంది ఆడియెన్స్ కోరుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం బాలయ్య నవరసాల్లో ఏదైనా చేయగలడు అని అంటున్నారు. మరీ అనిల్ రావిపూడి మూవీలో హాస్యాన్ని పండించాడో లేదో చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పవర్ స్టార్ ట్రెండ్ సెట్టర్.. ఏ హీరోకి సాధ్యం కాలేదు..!

 ఊర్వశి రౌటేలాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న వైసీపీ ?

Visitors Are Also Reading