Home » పవర్ స్టార్ ట్రెండ్ సెట్టర్.. ఏ హీరోకి సాధ్యం కాలేదు..!

పవర్ స్టార్ ట్రెండ్ సెట్టర్.. ఏ హీరోకి సాధ్యం కాలేదు..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. “ముఖ్యంగా నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను” అనే డైలాగ్ ఎవ్వరిదో అందరికీ తెలిసిన విషయమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ ఆయనకు సరిగ్గా సెట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు. కాబట్టి ఈ డైలాగ్ ఆయనకు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ ని చాలా వరకు ట్రెండ్ సెట్టర్ అంటారు. అందుకు  తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేశారు. అది ఎందుకు ? ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం BRO. ఈ సినిమా ఫస్ట్ మూడు రోజుల్లో రూ.100 కోట్లు వసూలు చేసింది. మూవీ యూనిట్ నుంచి 100Cr పోస్టర్ ని మాత్రం అఫిషియల్ గా రాలేదు. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన సినిమాల కలెక్షన్ల గురించి ఎప్పటికప్పుడు పోస్టర్స్ ద్వారా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ 100 కోట్ల కలెక్షన్లను ఫాస్ట్ గా సాధించినప్పటికీ ఒక్క పోస్టర్ ని కూడా రిలీజ్ చేయలేదు. దీనికి కూడా ఓ కారణం ఉందండోయ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత కొన్ని సమస్యలు అడ్డు వస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

తాజాగా జులై నెలకు సంబంధించి ట్విట్టర్ రిలీజ్ చేసిన మోస్ట్ సెర్చబుల్ పర్సనాలిటీ టాప్ టెన్ లిస్ట్ లో పవన్ స్థానం సంపాదించారు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉండటం విశేషం. ట్విట్టర్ విడుదల చేసిన ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉండగా.. ఇక ఆ తరువాత స్థానంలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, ఆ తరువాత స్థానాల్లో సునీల్ ఛత్రి, మహేంద్ర సింగ్ ధోని, ఎల్విష్ యాదవ్, పవన్ కళ్యాణ్, యోగి ఆదిత్యానంద్ ఉండగా.. సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి హీరో సూర్య, విజయ్ లు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ఈ తరుణంలో పవర్ స్టార్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

రూ.కోటికి భర్తను అమ్మిన భార్య.. ‘శుభలగ్నం’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!

పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading