Home » Naresh: కృష్ణ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. వీకె నరేష్ సీరియస్..!

Naresh: కృష్ణ పై పవన్ కళ్యాణ్ కామెంట్స్.. వీకె నరేష్ సీరియస్..!

by Sravya
Ad

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ కృష్ణ గారి మీద అవమానికరంగా మాట్లాడారు. అయితే ఇలా కృష్ణ గారిని తక్కువ చేసి ఎన్టీఆర్ గొప్పతనం గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కృష్ణ గురించి చేసిన కామెంట్స్ పై నరేష్ స్పందించారు. నరేష్ మాట్లాడుతూ కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కాస్త బాధాకరంగా ఉన్నాయని అన్నారు. కృష్ణ గారు రాజకీయాల్లో కొనసాగిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.

Advertisement

Also read:

ఆయన మనసు చాలా మంచిదని కూడా నరేష్ అన్నారు. రాజకీయాల పరంగా కృష్ణ గారు ఎప్పుడూ కూడా పొత్తులు మారలేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని నరేష్ అన్నారు. ఎప్పుడూ కూడా కృష్ణ గారు వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించిన దాఖలు లేవని నరేష్ వెల్లడించారు. ఎంతోమంది ఎంతో మంచి చేసే మనస్తత్వం ఉన్న కృష్ణ గారి గురించి పవన్ కళ్యాణ్ ఇలా అనడం బాధాకరంగా అనిపించాయని నరేష్ చెప్పారు.

Advertisement

Also read:

పవన్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలవాలని కూటమి కూడా గెలిచి ఆంధ్రప్రదేశ్ తిరిగి మళ్లీ వెలుగులు వెలగాలని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా నరేష్ చెప్పారు. అనవసరంగా రాజకీయాల్లోకి కృష్ణ గారి పేరుని తీసుకురావద్దని అన్నారు పవన్ కళ్యాణ్ మాటలు వెనుక ఉన్న ఉద్దేశం కృష్ణ గారిని కించపరిచే విధంగా ఆయన స్థాయిని తగ్గించే విధంగా లేవు అని పవన్ ఫాన్స్ నరేష్ కామెంట్లపై స్పందిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading