Home » Relationships: మీ లైఫ్ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అని అనుమానమా..? అయితే ఇలా తెలుసుకోండి..!

Relationships: మీ లైఫ్ పార్టనర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో అని అనుమానమా..? అయితే ఇలా తెలుసుకోండి..!

by Sravya
Ad

Relationships: ప్రతి ఒక్కరు కూడా జీవిత భాగస్వామితో కలకాలం కలిసి సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా ఇబ్బందులు కలగాలని కానీ విడిపోవాలని కానీ అనుకోరు. ఆధునిక కాలంలో అనుబంధాలు, ప్రేమలు విలువ బాగా తగ్గుతోంది. నమ్మకం అనే పునాది మీద నిలబడాల్సిన బంధాలు అనుమానాలు, మోసాలు మధ్య నడుస్తున్నాయి. జీవిత భాగస్వామి నిజంగా ప్రేమిస్తున్నారా..? లేదంటే మోసం చేస్తున్నారా అనేది తెలుసుకోవడం కూడా కష్టంగా ఉంటోంది. అయితే వాళ్ళు మోసం చేస్తున్నారనేది మనం ఎలా కనిపెట్టాలి..? అనే విషయాన్ని చూద్దాం..

Advertisement

ఈ లక్షణాలు కనుక ఉన్నాయంటే కచ్చితంగా మోసం చేస్తున్నారని మీరు గ్రహించొచ్చు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో సడన్ గా మార్పు వచ్చినా, లేదంటే ఇబ్బందికరంగా ఉండేలా ప్రవర్తిస్తున్న మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోవచ్చు. మీతో కమ్యూనికేషన్ విధానంలో మార్పులు వచ్చినా లేదంటే ఆకస్మికంగా మూడ్ స్వింగ్స్ కలుగుతున్న కూడా వాళ్ళు మోసం చేస్తున్నారేమో అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఓపెన్ గా కమ్యూనికేట్ చేసే భాగస్వామి ఇప్పుడు డిఫెన్స్ పద్ధతిలో మాట్లాడుతున్నట్లయితే కూడా మీరు పట్టించుకోవాలి.

Also read:

Advertisement

Also read:

అది స్నేహమొ ప్రేమనో లేదంటే మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మీతో మానసికంగా దూరంగా ఉంటున్న మీ జీవిత భాగస్వామి హఠాత్తుగా ఆసక్తి లేనట్లు మాట్లాడుతున్నా కూడా మీరు మోసం చేస్తున్నారేమో అని గ్రహించాలి. భవిష్యత్తు గురించి బెంగపెట్టుకుంటున్నట్లు మాట్లాడుతున్న మార్పు వచ్చిందేమోనని మీరు ఆలోచిస్తున్నా కూడా అనుమానపడాలి. ఇప్పటిదాకా సన్నిహితంగా ఉన్న వాళ్ళు హఠాత్తుగా అలా ఉండడానికి ఇష్టపడకపోవడం దూరంగా ఉండడం వంటివి చేస్తుంటే కూడా మీరు మీ బంధం గురించి ఆలోచించడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఫోన్ కి హఠాత్తుగా పాస్వర్డ్ పెట్టడం లాప్టాప్ కి పాస్వర్డ్ మార్చడం జాయింట్ గా వాడే అన్ని అకౌంట్స్ కి కూడా పాస్వర్డ్ మార్చడం వంటివి చేస్తే మీరు ఏదో పొరపాటు జరుగుతోందని గ్రహించాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading