Telugu News » Blog » ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?

ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు..?

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసింది. కానీ జడేజా న్యాయకత్వంలో చెన్నై దారుణంగా విఫలమైంది. 8 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలు అందుకున్న జడేజా.. ఆటగాడిగా కూడా రాణించలేకపోతున్నాడు. అందుకే తన ఆట పైన దృష్టి పెట్టాలి అని కెప్టెన్సీ బాధ్యతలను మళ్ళీ ధోనికే ఇచ్చేసాడు ధోని. దాంతో ఇన్ని రోజులుగా తన తర్వాతి కెప్టెన్ జడేజా అనుకున్న అభిమానులకు షాక్ తగిలింది.

Advertisement

అయితే జడేజా వచ్చే ఐపీఎల్ 2023 లో దాదాపుగా ఆడాడు. మరి ఆ సీజన్ లో చెన్నైని నడిపించేది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మాములుగానే డాడీస్ ఆర్మీగా పేరొందినా చెన్నై జట్టులో అందరి సీనియర్ ఆటగాళ్లే ఉన్నారు. అమ్బటి రాయుడు, బ్రావో, రాబిన్ ఊతప్ప వంటి సీనియర్ ఆటగాళ్లను కెప్టెన్ గా చేసిన.. వారు ఆడేది ఇంకా కొద్ది కాలమే. కాబట్టి మాల్లో కెప్టెన్ ని వెతకాలి.

Advertisement

ఆలా కాదని.. దీపక్ చాహర్, ఋతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లను కెప్టెన్ గా చేద్దాం అంటే.. వారికీ సలహాలు ఇవ్వడానికి ధోని గ్రౌండ్ లో ఉండడు. కాబట్టి ఎవరిని చెన్నై తర్వాతి కెప్టెన్ చేయలేనిది జట్టు యజమాన్యానానికి అర్ధం కావడం లేదు. ఒకవేళ ఐపీఎల్ 2023 కోసం జరిగే వేలంలో ఎవరైనా ఆటగాడిని కొని తనకు కెప్టెన్సీ ఇవ్వాలి. లేదంటే.. ఉన్నవారిలో అంబటి రాయుడికీ కెప్టెన్సీ ఇవ్వడమే బెస్ట్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్…!

Advertisement

సన్ రైజర్స్ కు వార్నర్ బుద్ధి చెప్పాడు…!

You may also like