Telugu News » Blog » సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్…!

సన్ రైజర్స్ పై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్…!

by Manohar Reddy Mano
Ads

ఐపీఎల్ 2022 లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ తీసుకోవడంతో మొదట ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్ లో పృథ్వీ షా స్థానంలో ఓపెనర్ గా వచ్చిన మన్దీప్ విఫలమయ్యాడు. మొదటి ఓవర్ లోనే గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు.

Advertisement

కానీ మరో పోయినారు క్రీజులో నిలదిక్కుకునే సమయంలోనే మిచెల్ మార్ష్ (10), పంత్ (26) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్న… ఆ తర్వాత రోవ్మాన్ పావెల్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. పావెల్ వచ్చిన తర్వాత రెచ్చిపోయిన వార్నర్.. 58 బంతుల్లో 92 పరుగులు చేసి చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచాడు. పావెల్ కు చివర్లో రెచ్చిపోయి 35 బంతుల్లో 67 పరుగులు చేసాడు. దాంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.

Advertisement

ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో వచ్చిన సన్ రైజర్స్ కు మొదట్లోనే షాక్ తగిలింది. టాప్ ఆర్డర్ రాణించకపోవడంతో 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అనతరం ఐడెన్ మార్క్రామ్ (42), నికోలస్ పూరన్ (62) తో జట్టును లక్ష్యం వైపుకు నడిపిస్తూ.. చివరి 2 ఓవర్ల ముందు పెవిలియన్ చేరారు. ఇక ఆ తర్వాత ఆఖర్లో ఎవరు పరుగులు చేయకపోవడంతో 186 వద్ద నిలిచిపోయిన హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. ఇది హైదరాబాద్ కు వరుసగా మూడో పరాజయం.

ఇవి కూడా చదవండి :

అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ పై కోచ్ కీలక వ్యాఖ్యలు..!

Advertisement

నన్ను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసారు…!

You may also like