Home » ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?

ఇప్పటివరకు ఏ జట్టు ఎన్ని ఆసియా కప్పులు గెలిచిందో తెలుసా..?

by Azhar
Ad

క్రికెట్ లో ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్పు టోర్నీ అనేది అన్ని జట్లకు చాల ముఖ్యం. అయితే క్రికెట్ ఆడే దేశాలలో ఆసియాకు చెందిన దేశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి 1984 లో ఆసియా జట్ల కోసం ఆసియా కప్ టోర్నీ అనేది ప్రారంభించారు. అయితే ప్రతి రెండేళ్లకు ఓసారి ఈ టోర్నీ అనేది జరుగుతుంది. అలా ఇప్పటివరకు ఆసియా కప్ అనేది 14 సార్లు జరిగింది. మధ్యలో కొన్ని సార్లు పలు కారణాల వల్ల జరగలేదు.

Advertisement

కరోనా కారణంగా 2020 లో కూడా ఈ టోర్నీ జరగని విషయం తెలిసిందే. అయితే మొత్తం ఆరు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో గడిచిన 14 ఎడిషన్స్ లో మన భారత జట్టే అత్యధికంగా ఈ టైటిల్ ను కైవసం అనేది చేసుకుంది. మొట్టమొదటిసారి 1984 లోనే ఫైనల్స్ లో శ్రీలంకను ఓడించి ఇండియా విన్నర్ గా నిలిచింది.

Advertisement

అలా ఇప్పటివరకు మొత్తం 7 సార్లు ఆసియా కప్ ను అందుకొని అగ్రస్థానంలో ఉంది. ఇక ఆయా తర్వాత శ్రీలంక జట్టు 4 సార్లు ఈ కప్పును అందుకుంది. రెండుసార్లు ఆసియా కప్ లో గెలిచి పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇక మిగిలిన జట్లు ఒక్కసారి కూడా ఈ టైటిల్ అనేది అందుకోలేదు. అయితే ఈ నెల 27 నుండి ప్రారంభం కాబోతున్న ఆసియా కప్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

వికెట్ పడకుండా విజయం సాధించిన భారత్..!

వన్డేలు ఎప్పటికి చనిపోవు..!

Visitors Are Also Reading