Home » వికెట్ పడకుండా విజయం సాధించిన భారత్..!

వికెట్ పడకుండా విజయం సాధించిన భారత్..!

by Azhar
Ad

టీం ఇండియా ప్రస్తుతం జింబాంబ్వే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మూడు వన్డేల కోసం ఈ పర్యటనకు వెళ్లిన భారత జట్టు కేఎల్ రాహుల్ న్యాయకత్వంలో ఈరోజు మొదటి మ్యాచ్ లో తలపడింది. అయితే స్టార్ ఆటగాళ్లకు అందరికి ఈ టూరు నుండి బీసీసీఐ రెస్ట్ ఇవ్వడంతో.. ఈ సిరీస్ అనేది కొంచెం జట్టుకు కష్టం ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. కానీ నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో టీం ఇండియా సాధించిన విజయం చూస్తే ఎవరు అలా అనుకోరు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన జింబాంబ్వేకు చుక్కలు చూపించారు మన బౌలర్లు. ఆ జట్టు పతనాన్ని వరుస వికెట్లతో దీపక్ చాహర్ ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత మన బౌలర్లు అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు, చాహర్ మూడు, ప్రసిద్ కృష్ణ మూడు, శ్రీరాజ్ ఒక్క వికెట్ తో రాణించడంతో జింబాంబ్వే 189 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది.

Advertisement

ఇక ఆ తర్వాత 190 పరుగుల లక్ష్యంతో వచ్చిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయం అనేది అందుకుంది. శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన గిల్ కూడా బాగా రాణించాడు. ధావన్ 81, గిల్ 82 పరుగులు చేయడంతో ఈ వన్డేలో గెలిచిన భారత మూడు వన్డేల ఈ సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.

ఇవి కూడా చదవండి :

ధోని ఫ్యాన్స్ కు నిరాశ…!

సన్‌ రైజర్స్ కొత్త పేరు ఏంటో తెలుసా…?

Visitors Are Also Reading