Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి వ్యాపారం అనుకూలం

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి వ్యాపారం అనుకూలం

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

కాలం స‌హ‌క‌రిస్తోంది. ధైర్యంగా ప‌నులు పూర్తి చేయండి. ఉద్యోగంలో మంచి జ‌రుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారరిత్యా మిశ్ర‌మ ఫ‌లం. వారం మ‌ధ్య‌లో ఆనందించే అంశం ఉంది. అపోహ‌లు తొల‌గుతాయి. కొన్ని స‌మ‌స్య‌ల‌కు స‌మాధానం దొరుకుతుంది. ఆవేశ‌ప‌రిచే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu : వృషభం 

అధికార బ‌లం పెరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు ఆర్థికంగా వెసులుబాటు ఉంటాయి. వ్యాపార బ‌లం మిశ్ర‌మం. ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగండి. కొంద‌రి వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. స్వ‌యం కృషితోనే అభివృద్ధి సాధ్యం. కాలం కొంత వ్య‌తిరేకంగా ఉన్నందువ‌ల్ల సంయ‌మ‌నం పాటించండి.

Today rashi phalau in telugu : మిథునం

ఆలోచ‌న‌ల్లో స్ప‌ష్టత అవ‌స‌రం. గంద‌ర‌గోళ స్థితికి దూరంగా ఉండాలి. ఎదుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు మొద‌లు పెట్టాలి. వ్యాపార న‌ష్టం రాకుండా చూడాలి. ప‌ట్టువిడుపులు మేలు. మొహ‌మాటం వ‌ల్ల ఆర్థిక న‌ష్టం జ‌రుగ‌వ‌చ్చు. ఇంట్లో వారితో సంప్ర‌దించి నిర్ణ‌యాలు తీసుకోండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

మనోబ‌లం అవ‌స‌రం. ఉద్యోగ‌ప‌రంగా ఒడుదొడుకులు ఉంటాయి. స‌మ‌యస్పూర్తితో స‌మ‌స్య‌లు తొలుగుతాయి. అధికార లాభం సూచితం. భారీ ల‌క్ష్యాల‌తో ముంద‌డుగు వేయాలి. వ్యాపారంలో స‌మస్య రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : సింహం

ఉత్త‌మ కాలం న‌డుస్తోంది. అన్ని విధాలుగా మేలు జ‌రుగుతుంది. ఉద్యోగంలో కీర్తి ల‌భిస్తుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నం ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యం మీదే భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి ఇంట్లో వారిని సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకోవాలి. ఏది ప్రారంభించినా క‌లిసి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : క‌న్య

ఆత్మ విశ్వాసంతో ప‌ని ప్రారంభించండి. విజ‌యం ల‌భిస్తోంది. ఉద్యోగ‌ప‌రంగా ప‌ద‌వీ యోగం సూచితం. తోటి వారి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీ శ్ర‌మ ఫ‌లిస్తుంది. ఆశ‌యం నెర‌వేరుతుంది. కార్య‌సిద్ధి విశేషంగా ఉంటుంది. స‌మ‌యాన్్ని స‌ద్వినియోగం చేసుకునే కాల‌మిది. వ్యాపారంలో జాగ్ర‌త్త‌.

Also Read : హీరోగా స‌క్సెస్ బిజినెస్ లో ఫెయిల్….”ట్రూజెట్” కోసం చ‌ర‌ణ్ తిప్ప‌లు..!

Today rashi phalau in telugu : తుల

అదృష్ట‌ఫ‌లాలు అందుతాయి. అద్భుత‌మైన కార్య‌సిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో గౌర‌వం లభిస్తుంది. ద‌గ్గ‌రి వారి వ‌ల‌న క‌లిసి వ‌స్తుంది. వ్యాపంర చాలా బాగుంటుంది. ధ‌న లాభం పెరుగుతుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. జీవితంలో పైకి వ‌చ్చే అంశాలు చాలా ఉన్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట‌యోగాన్ని అందుకుంటారు. ఆత్మ‌స్థైర్యం త‌గ్గ‌కుండా ప‌ట్టువిడుపుల‌తో ప‌నుల‌ను పూర్తి చేయండి. వివాదాల‌కు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో మంచి ఫ‌లితాలు ఉన్నాయి. వ్యాపార రిత్యా మిశ్ర‌మ ఫ‌లితం గోచ‌రిస్తోంది. వివాదాల జోలికి పోవ‌ద్దు. వారంతంలో విజ‌యం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

స‌ర్వోత్త‌మ కాలం. ఏ ప‌ని చేసినా విజ‌యం వరిస్తుంది. మంచి ప‌నుల‌తో బంగారు భ‌విష్య‌త్‌ను సొంతం చేసుకోండి. గ‌తంలో కానీ ప‌నులు ఇప్పుడు పూర్తి అవుతాయి. సందేహించ‌కుండా ల‌క్ష్యాన్ని సాధించండి. మిత్రుల ద్వారా లాభ‌ప‌డ‌తారు. ప‌లు మార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ రిత్యా స్థిర‌త్వం వ‌స్తుంది.

Today rashi phalau in telugu మకరం

ముఖ్య‌కార్యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఇబ్బందులు క‌న‌ప‌డుతున్నాయి. ఆలోచ‌న‌ల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఓర్పు అవ‌స‌రం. తెలియ‌ని వ్య‌క్తుల‌తో చ‌నువుగా సంభాషించ‌వ‌ద్దు. అపార్థాల‌కు అవ‌కాశ‌ముంది. కాలం స‌హ‌క‌రించ‌డం లేదు. మిత్రుల స‌ల‌హా తీసుకోండి. వ్యాపారంలో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

ఆర్థికంగా లాభం ఉంటుంది. ఉద్యోగ రిత్యా శ్ర‌మ పెరుగుతుంది. వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ల‌క్ష్యాన్ని సాధించాలి. చంచ‌ల‌త్వంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. ధ‌ర్మ మార్గంలో ముందుకు సాగాలి. కుటుంబ ప‌రంగా అభివృద్ధి ఉంటుంది.

Today rashi phalau in telugu : మీనం

మంచి జీవితం ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. కాలం స‌హ‌క‌రిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. నిండు మ‌న‌స్సుతోనే ప‌ని అద్భుత‌మైన విజ‌యాన్ని ఇస్తుంది. స‌మ‌య‌స్పూర్తితో లాభ‌ప‌డ‌తారు.

Also Read :  గ‌డ్డ‌గ‌ట్టే చ‌లిలో కిమ్ జోంగ్ ఇల్ జ‌యంతి వేడుక‌లు

Visitors Are Also Reading