Home » మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ పుట్టిందంటున్న టీమిండియా క్రికెటర్..

మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ పుట్టిందంటున్న టీమిండియా క్రికెటర్..

by Anji
Ad

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ రెండవ సారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య తాన్య వధ్వా మార్చి 08న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది.  ఈ విషయాన్ని ఉమేష్ యాదవ్ నే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇట్స్ ఏ బేబీ గర్ల్.. మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మీ అడుగుపెట్టింది. మరోమారు అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందినందుకు ఆనందగా, గర్వంగా ఉంది అని పేర్కొన్నాడు ఉమేశ్. 

Also Read :  నందమూరి తారకరత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడా ? అసలు ఏం జరగబోతుంది..!

Advertisement

ఉమేశ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ఉమేశ్ యాదవ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ గా సేవలు అందిస్తున్న ఉమేశ్ 2013 మే 29న పంజాబ్ కి చెందిన తాన్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ ప్రేమ బంధానికి గుర్తింపుగా 2021 జనవరి 01న ఆడబిడ్డ వీరి ఇంట్లోకి అడుగుపెట్టింది. తాజాగా రెండోసారి తాన్య పాపకే జన్మనిచ్చింది. దీంతో ఉమేశ్ ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతోంది. 

Also Read :  ఆ హీరోయిన్ తో క‌ల్యాణ్ రామ్ ప్రేమాయ‌ణం..? కానీ అలా జ‌ర‌గ‌టంతో చివ‌రికి..!

కొద్ది రోజుల కిందట ఉమేశ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులు అనారోగ్యంగా బాధపడుతున్న అతని తండ్రి తిలక్ యాదవ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసాడు. ఆసీస్ తో మూడో టెస్ట్ కు కూడా ఉమేశ్ అందుబాటులో ఉండడు అని వార్తలు వచ్చాయి. తండ్రి అంత్యక్రియలు ముగిసిన వెంటనే జట్టుతో చేరాడు ఉమేశ్. తండ్రిని కోల్పోయిన బాధలోనూ నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించాడు. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు. దీంతో స్వదేశంలో 100 వికెట్లను తీసిన 5వ పేసర్ గా రికార్డులకెక్కాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్ట్ మార్చి 09 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే.. ఈ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా  విజయం సాధించాల్సిందే.

Also Read :   Jio దెబ్బకు దిగివచ్చిన స్టార్…ఇక ఫ్రీగా IPL 2023.. ఎలాగంటే !

Visitors Are Also Reading