Home » ఆ హీరోయిన్ తో క‌ల్యాణ్ రామ్ ప్రేమాయ‌ణం..? కానీ అలా జ‌ర‌గ‌టంతో చివ‌రికి..!

ఆ హీరోయిన్ తో క‌ల్యాణ్ రామ్ ప్రేమాయ‌ణం..? కానీ అలా జ‌ర‌గ‌టంతో చివ‌రికి..!

by AJAY
Ad

నంద‌మూరి ఫ్యామిలీ నుండి బాల‌య్య త‌ర‌వాత త‌రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్, తార‌క‌ర‌త్న‌, క‌ల్యాణ్ రామ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు. అద్భుత‌మైన న‌ట‌న‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇక తార‌క‌ర‌త్న స్టార్ హీరో అవ్వ‌లేక‌పోయినా త‌న న‌ట‌న‌తో ప్ర‌శంస‌లు అందుకున్నారు.

ALSO READ :శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే..!

Advertisement

 

ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో వ‌చ్చిన స‌మ‌స్య‌ల వ‌ల్ల తార‌క‌ర‌త్న స్టార్ గా ఎద‌గ‌లేక‌పోయారు. ఇప్పుడిప్పుడిప్పుడే ఆయ‌న‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తుండ‌గా రీసెంట్ గా ఆయ‌న ఈ లోకాన్ని విడిచిపెట్టివెళ్ల‌డం బాధాక‌రం. అంతే కాకుండా మ‌రో నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభంలో అడ‌పాద‌డపా సినిమాల‌తో నెట్టుకొచ్చారు. కానీ బింబిసార‌తో క‌ల్యాణ్ రామ్ రేంజ్ పెరిగిపోయింది. అంతే కాకుండా క‌ల్యాణ్ రామ్ రొటీన్ సినిమాల‌ను కాకుండా ముందు నుండి డిఫ‌రెంట్ క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు.

Advertisement

ఇక ప్ర‌స్తుతం కల్యాణ్ రామ్ అభిమానుల సంఖ్య కూడా పెర‌గ‌టంతో పాటూ భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టించేందుకు సిద్దం అవుతున్నాడు. మ‌రోవైపు నిర్మాత‌గానూ క‌ల్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే క‌ల్యాణ్ రామ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి అతికొద్దిమందికి మాత్ర‌మే తెలుసు. క‌ల్యాణ్ రామ్ స్వాతి అనే యువ‌తిని వివాహం చేసుకోగా వీరికి ఓ పాప మరియు ఓ బాబు ఉన్నారు. అయితే పెళ్లికి ముందు క‌ల్యాణ్ రామ్ ఓ స్టార్ హీరోయిన్ ను ప్రేమించార‌ట‌.

also read : ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

అంతే కాకుండా ఆ హీరోయిన్ నే పెళ్లి చేసుకోవాల‌ని కల్యాణ్ రామ్ భావించార‌ట‌. కానీ హ‌రికృష్ణ హీరోయిన్ తో పెళ్లికి నో చెప్పాడ‌ట‌. అయితే ఆ హీరోయిన్ పేరు తెలియ‌దు కానీ ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ గా రానించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాకుండా ప్ర‌స్తుతం ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుని మ‌ళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింద‌ట‌. అయితే ఇందులో ఎంతవ‌ర‌కూ నిజం ఉందో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం క‌ల్యాణ్ రామ్ హీరోయిన్ తో ల‌వ్ స్టోరీ అంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ALSO READ :పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా..!

Visitors Are Also Reading