Home » అసలు పోసానికి ‘మెగా ఫామిలీ’ అంటే కోపం ఎందుకు? అసలు ఎక్కడ చెడింది?

అసలు పోసానికి ‘మెగా ఫామిలీ’ అంటే కోపం ఎందుకు? అసలు ఎక్కడ చెడింది?

by Sravya
Ad

పోసాని కృష్ణ మురళి ఎన్నో సినిమాల్లో నటించారు. మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. నటనతో మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. గత కొన్నాళ్లుగా మెగా కుటుంబం అంటే చాలు ఒంటి కాలు మీద లేస్తున్నారు. పవర్ఫుల్ డైలాగ్ లు పంచులతో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతూ ఉంటారు. చిరంజీవిని ఎక్కువగా పోసాని అభిమానించేవారు. అలానే అసలు పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది పోసాని. పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత మూవీకి పోసాని డైలాగ్ రైటర్ గా పని చేశారు. ఆ సినిమా ప్రచార సమయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అవుతాడని చెప్పారు.

Advertisement

పోసాని చెప్పినట్లు గోకులంలో సీత పెద్ద హిట్ అందుకుంది ఈ మూవీ హిట్ తర్వాత చిరంజీవి పవన్ లకు ఆప్తుడైపోయారు. పోసాని మెగాస్టార్ కి తలలో నాలుకలా మారిపోయారు. చిరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహాయ సహకారాలను అందించారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా మారారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు అయితే మెగాస్టార్ నిర్ణయాన్ని ఆయన అభిమానులతో పాటు సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.

Advertisement

Also read:

Also read:

పోసాని కూడా ఈ విషయంలో చిరంజీవి తప్పు పట్టారు తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం తీసుకువచ్చి విమర్శలు చేశారు పోసాని మురళి. పిఅర్పి విషయంలో చిరంజీవికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారని ప్రజారాజ్యం విఫలమైన తర్వాత పార్టీ ని మధ్యలో వదిలేసి వదిలేసిన వ్యక్తులలో పవన్ కళ్యాణ్ ఒకరిని ఆయన ఆరోపించారు. తాను మాత్రమే చివరిదాకా మెగాస్టార్ తో నడిచారని ఒకానొక సందర్భంలో పోసాని అన్నారు ఈ పరిణామాలు తర్వాత పోసానికి మెగా ఫ్యామిలీకి దూరం బాగా పెరిగింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading