Home » నందమూరి తారకరత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడా ? అసలు ఏం జరగబోతుంది..!

నందమూరి తారకరత్న చేసిన తప్పే మంచు మనోజ్ చేస్తున్నాడా ? అసలు ఏం జరగబోతుంది..!

by Anji
Ad

మంచు మనోజ్ ఇటీవలే భూమా మౌనికరెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే పెళ్లికి ముందు పెళ్లి తరువాత పలు వివాదాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు మనోజ్. చాలా రోజులుగా మౌనికరెడ్డిని పెళ్లి చేసుకోనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం విధితమే. ఎట్టకేలకు ఇటీవల వీరి పెళ్లి జరిగింది. గత కొద్ది నెలలుగా కుటుంబంలో వీరి పెళ్లి గురించి గొడవలు జరుగుతున్నాయనే విషయం చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.  

Also Read :  ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

Advertisement

 

మంచు మనోజ్ మౌనికని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం.. అది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కానీ వీరు ఆరు నెలల నుంచి సహజీవనం చేస్తున్నారనే విషయం ప్రస్తుతం బయటికి వస్తోంది. మంచు మనోజ్, మౌనిక వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లినే. అటు మౌనిక తన భర్తకు, మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఆ తరువాత మనోజ్, మౌనిక సహజీవనం చేయడం మొదలుపెట్టారు. మౌనిక రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మనోజ్ కి కష్టాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఓ వైపు సినిమాలు ఆగిపోతున్నాయి. చాలా రోజులుగా అతని కెరీయర్ ముందుకెళ్లడం లేదు. మౌనికరెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో మనోజ్ కి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. తాను నటించే సినిమాలు కూడా ముందుకెళ్లేలా కనిపించడం లేదు. సినిమా రకంగా మంచు మనోజ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. తొలుత మనోజ్ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. 

Advertisement

Also Read :  అక్కినేని అఖిల్ కి కాబోయే భార్య ఈమెనా..? అభిమానులు ఏమంటున్నారంటే..?

Manam News

 

మరోవైపు రాజకీయాల కోసమే మనోజ్ పెళ్లి చేసుకున్నాడని వార్తలు కూడా వినిపించాయి. కానీ తాజాగా మనోజ్ ఆ ఆలోచనని విరమించుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల నందమూరి తారకరత్న కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నవిషయం తెలిసిందే. ఓ వైపు సినిమాలు, కెరీర్ ని కోల్పోయి, మరోవైపు కుటుంబానికి దూరమై డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చిన్న వయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లారు తారకరత్న. మంచు మనోజ్ కూడా కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు. తన కెరీర్ లో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ముందు ముందు ఇలాగే కొనసాగితే మరిన్నీ సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ మనోజ్ జీవితం వ్యక్తిగతంగా బాగుండాలని కోరుకుంటున్నారు అభిమానులు.  

Also Read :  శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే..!

Visitors Are Also Reading