Home » రుద్రాక్ష మాలను ధరిస్తున్నారా…? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.

రుద్రాక్ష మాలను ధరిస్తున్నారా…? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.

by Bunty
Ad

చాలామంది రుద్రాక్షలు వేసుకుంటారు. కానీ రుద్రాక్ష వేసుకుంటే ఏం జరుగుతుంది, రుద్రాక్ష ఎలా వచ్చింది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. అసలు రుద్రాక్ష ఎలా వచ్చింది? రుద్రాక్షను ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం… రుద్రుడు అంటే శివుడు, మూడు పురములతో పోరాడినప్పుడు మరణించిన రాక్షసులను చూసి విచారించారు. అలా విచారించిన సమయంలో ఆయన కంటి నుండి జారిపడిన కన్నీళ్లు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటి నుండి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అంటే రుద్రుడి కళ్ళు కన్నీళ్లు అని అర్థం వస్తుంది.

READ ALSO : UPI Transaction : UPI ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా… అయితే ఈ తప్పులు చేయకండి!

Advertisement

Advertisement

ఆత్మసాక్షాత్మాకారం పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గం. ఇవే భూమికి స్వర్గానికి వారధి అని పురాణాల్లో ఉంది. రుద్రాక్షలు ఎంతో పవిత్రమైనవి శక్తివంతమైనవి కూడా, రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు తొలగుతాయని చెబుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన వారు కూడా రుద్రాక్షలను ధరిస్తే ఆ అలవాట్ల నుండి బయట పడతారని చెబుతున్నారు.

READ ALSO :  : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక రుద్రాక్షలో 21 రకాలు ఉన్నాయి.  ఇక రుద్రాక్ష మాలను ధరించిన వారు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ మాలను ధరించిన వాళ్ళు మైల పడిన వారిని తాకకూడదు. రుద్రాక్ష ధరించిన వారు స్మశానం కు వెళ్లకూడదు. రుద్రాక్షను ఉంగరంలో ధరించకూడదు. స్త్రీలు రుతుస్రావం సమయంలో రుద్రాక్షను ధరించకూడదు. అంతేకాకుండా రుద్రాక్షను ధరించి పాల్గొనకూడదు. ఇలా రుద్రాక్షల్లో ఎంతో పవిత్రమైనది. ఏకముఖి రుద్రాక్ష అని పంచాంగ నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..

Visitors Are Also Reading