Home » ఆ మూవీ చేసి విజయ్ దేవరకొండ తప్పు చేసాడా..?

ఆ మూవీ చేసి విజయ్ దేవరకొండ తప్పు చేసాడా..?

by Sravya

విజయ్ దేవరకొండ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నప్పుడే అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయారు. తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు తాజాగా ప్రేక్షకుల్ని ఫ్యామిలీ స్టార్ సినిమాతో పలకరించారు ఈ సినిమా అనవసరంగా ఒప్పుకుని చేస్తానని ఇప్పుడు తన సన్నిహితులు దగ్గర చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో విజయ్ ఇమేజ్ కి సరిపడా కదలేదు అసలు కథలో పెద్దగా మేటర్ కూడా లేదు ఏదో స్టోరీని తీసుకువచ్చి జనరేషన్ కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు. కొంచెం పాత కథలానే కనబడింది. కథలో ఏ మాత్రం కొత్తదనం కనబడలేదు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ మూవీ చేసినందుకు విజయ్ దేవరకొండ చాలా ఫీల్ అవుతున్నట్లు గీత గోవిందం వంటి సూపర్ సక్సెస్ కాంబినేషన్ కనుక విజయ్ ఈ మూవీని ఓకే చేశారు.

Also read:

family-star-movie

Also read:

లేదంటే ఈ సినిమా చేసి ఉండేవారు కాదేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ వరుసగా మూడు సినిమాలతో ప్రస్తుతం సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే ఈ మూడు సినిమాలే అతన్ని ఇండస్ట్రీ స్టార్ హీరోగా మార్చే సినిమాలు అని మరి కొంతమంది అభిమానులు ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా విజయ్ దేవరకొండ రాబోయే సినిమాలతో హిట్లు కొడతారు అని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో విజయ్ దేవరకొండ కి హిట్లు వస్తాయో లేదో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading