టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2020 సంవత్సరం కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు… మరణించారు. ఇక తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో !టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో సాగర్ మరణించినట్లు ఆయన తనయుడు అధికారిక ప్రకటన చేశారు.
Advertisement
Advertisement
గత కొన్ని రోజులుగా లివర్ సమస్యతో సాగర్ బాధపడుతున్నారు. చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చికిత్స తీసుకుంటూ బాగానే ఉన్నారు సాగర్. కానీ ఇవాళ ఉదయం ఆయన పరిస్థితి విషమించడంతో… చెన్నైలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ సాగర్ మృతి చెందారు. టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించారు సాగర్.
దాదాపు 30 సినిమాల వరకు ఆయన తీశారు. సూపర్ స్టార్ కృష్ణ, సుమన్, బాలచందర్ మరియు సాయికుమార్ లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు అందించారు.రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన సాగర్… అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ వన్, అన్వేషణ, ఓసి నా మరదలా, డాకు తదితర చిత్రాలు ఆయన తీశారు.
Advertisement
Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి