Home » రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి కృష్ణమ్మ..!

రిలీజ్ అయిన వారానికే ఓటీటీలోకి కృష్ణమ్మ..!

by Sravya

ప్రస్తుతం టాలీవుడ్ లో సరైన సినిమాలు రాక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా మూగబోయింది. ఒక్కసారిగా సినిమా వాతావరణం అంతా కూడా మాయం అయ్యిపోయింది. ఎక్కడ చూసినా ఎలక్షన్ల వాతావరణమే కనపడుతోంది. అందరు పాలిటిక్స్ మీదే ఫోకస్ చేసేసారు. పైగా చాలా వరకు సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు వెనుకడుగు వేశారు. అయితే కొన్ని చిన్న చిన్న సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని పర్వాలేదు అనిపిస్తే కొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

krishnamma Review and Rating

krishnamma

Also read:

గత వారం శుక్రవారం రిలీజ్ కి వచ్చిన కృష్ణమ్మ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటించారు. గోపాలకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రస్టిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా గా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. వారం దాటకుండానే ఓటీటీ లోకి వచ్చి అందరిని ఒక్కసారి గా షాక్ అయ్యేలా చేసింది. ఈ రోజు ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవ్వబోతోంది.

krishnamma-review

Also read:

అసలు ఎందుకు అప్పుడే ఓటీటీ లోకి వచ్చేసిందని ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. బ్రేక్ ఈవెన్ ని అందుకోవడమే ఇందుకు కారణం అని ఈ వారం లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కొట్టేసినట్లుగా వార్తలు వచ్చాయి. అందుకని ఓటీటీ నుండి వచ్చే కొద్దీ మొత్తం కూడా నిర్మాతలకి ప్లస్ అవుతుందని వారంలోనే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను చూడాలనుకుంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading