Home » UPI Transaction : UPI ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా… అయితే ఈ తప్పులు చేయకండి!

UPI Transaction : UPI ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారా… అయితే ఈ తప్పులు చేయకండి!

by Bunty

డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ ప్రయాణంలో బలమైన మొదటి అడుగుగా డిజిటల్ పేమెంట్స్ ను చెప్పవచ్చు. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువమంది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్ పద్ధతి దాదాపు ప్రతి చోట అందుబాటులో ఉంది. యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిజికల్ క్యాష్, వాలెట్లు మోసుకెళ్లే భారం దాదాపుగా తగ్గిపోయింది.

READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

 

అయితే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ కనుక చేస్తే పొరపాటున కూడా యూపీఐ కోసం చెల్లించే నాలుగు లేదా 6 అంకెల పిన్ నెంబర్ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీరు పెద్ద ఎత్తున డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. ఇలా యూపీఐ ఆధారిత యాప్ కి కూడా లాక్ పెట్టుకోవడం ఎంతో మంచిది. ఇలాంటి పిన్ విషయంలో మీరు కనుక ఏమాత్రం అశ్రద్ధ వహించిన మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే సైబర్ నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న విషయం మనకు తెలిసిందే.

READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..

 

ఈ క్రమంలోనే మీ మొబైల్ నెంబర్ కు ఆఫర్లు ఉన్నాయి అంటూ లింకు పంపించి, లింక్ పై క్లిక్ చేయమని కనుక మెసేజ్ వస్తే పొరపాటున కూడా అలాంటి లింక్ క్లిక్ చేయకూడదు. మీరు కనుక ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల సైబర్ నేరగాళ్ల చేతిలోకి మీ వ్యక్తిగత డేటా మొత్తం వెళ్లిపోతుంది. తద్వారా మీ బ్యాంకు ఖాతా ఖాళి అయ్యే పరిస్థితిలు ఏర్పడతాయి. ఇక ప్రతి ఒక్కరు రెండు కంటే ఎక్కువ యూపీఐ యాప్ లను ఉపయోగించకపోవడం ఎంతో మంచిది.

READ ALSO : మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

Visitors Are Also Reading