Home » Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

by Bunty
Ad

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరపైకి తీసుకువచ్చాడు. మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ తో మనుషులు పోలిన మనుషుల కాన్సెప్ట్ ఈ సినిమా కథను దర్శకుడు రాసుకున్నాడు.

Also Read:  యాంకర్ సుమ చేతి పై పచ్చబొట్టు…..ఆ పేరు ఎవరిది..?

Advertisement

 

ఈ మూవీలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతున్న, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతుంది. ఫస్ట్ హఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ బాగుండడం గమనార్హం. సరికొత్త కాన్సెప్ట్ తో దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులు వస్తాయి గానీ పాటను అమిగోస్ లో రీమిక్స్ చేశారు.

Advertisement

READ ALSO : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

ఈ పాటకి వేటూరి సుందర రామమూర్తి లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాటను గతంలో ఇళయరాజా స్వర పరచగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర సంయుక్తగా ఆలపించారు. ఈ సినిమాకు ఈ పాట కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అయింది. కాగా, ఆమిగోస్ మూవీ ఓటిటి రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందట. అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఈ సినిమా ఏప్రిల్ 1వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

read also : బాలయ్యను ఏపీ సీఎంగా చూడాలని తారకరత్న భావించారా.. అందుకే ఇలా చేశారా ?

Visitors Are Also Reading