Home » “బొమ్మరిల్లు” సినిమాకు ఆ టైటిల్ ఎలా పెట్టారో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!

“బొమ్మరిల్లు” సినిమాకు ఆ టైటిల్ ఎలా పెట్టారో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు!

by Srilakshmi Bharathi
Ad

“అంతేనా”… “ఇంకేం కావాలి..” , “వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్ కాఫీ..”? ఈ డైలాగ్స్ చూడగానే అర్ధం అయిపోయి ఉంటుంది. “బొమ్మరిల్లు” సినిమా ఎంత పాపులర్ అయ్యిందో చెప్పడానికి ఈ డైలాగ్స్ చాలు. ఇప్పటికీ ఈ డైలాగ్స్ రింగ్ టోన్ గా యూజ్ చేసుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, జెనీలియా ల ప్లేస్ లో వాళ్ళని తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేనంతగా ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు.

bommarillu

Advertisement

ఈ సినిమా దర్శకుడు భాస్కర్ కి కూడా బొమ్మరిల్లు భాస్కర్ అన్న పేరు సార్ధకం అయిపొయింది. అయితే.. ఇంత మంచి సినిమాకు టైటిల్ నామకరణం చేయడం మాత్రం చాలా విచిత్రంగా జరిగిందండోయ్. సుకుమార్ “ఆర్య” సినిమాకు భాస్కర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ఆర్య షూటింగ్ టైం లో భాస్కర్ పనితనం నచ్చిన దిల్ రాజ్ భాస్కర్ కి అవకాశం ఇస్తానని, స్టోరీ సిద్ధం చేసుకోమని చెప్పారు. భద్ర సినిమా తరువాత భాస్కర్ దిల్ రాజ్ కు ఓ స్టోరీ లైన్ ను చెప్పారు.

bommarillu

Advertisement

ఆ స్టోరీ నే “బొమ్మరిల్లు”. ఈ స్టోరీ లైన్ దిల్ రాజుకు బాగా నచ్చేసింది. హీరో రోల్ కోసం మొదట అల్లు అర్జున్ ను, ఎన్టీఆర్ ను అడిగారు. వాళ్ళు ఒప్పుకోలేదు. సిద్ధార్థ్ ను అడగగానే ఒప్పేసుకున్నాడు. హ్యాపీ సినిమా లో జెనీలియా ను చూసిన భాస్కర్ ఆ అమ్మాయే హాసిని అని ఫిక్స్ అయిపోయాడు. ఇక షూటింగ్ కి అన్నీ సిద్ధం చేసేసుకున్నారు. టైటిల్ విషయంలో ఏమి పెట్టాలా అని ఆలోచిస్తున్న టైం లో వైవిఎస్ చౌదరి కొత్తగా ఓ బ్యానర్ ఓపెన్ చేసి దిల్ రాజుకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ ఇన్విటేషన్ కార్డు లో బొమ్మరిల్లు అన్న పేరు చూసిన భాస్కర్ అదే తన సినిమా టైటిల్ గా ఫిక్స్ అయిపోయారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?

ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

‘అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!

Visitors Are Also Reading