Home » ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

ఆదిపురుష్ లో హనుమంతుడిగా నటించిన దేవ్ దత్త గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా రామాయణం కథలో అత్యంత కీలక పాత్ర పోషించిన యోధుడు హనుమంతుడు అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. రామనామ జపంతోనే జీవితాన్ని అంతా గడిపిన రామభక్తుడు. సీతారాములతో పాటు అత్యధికులు పూజించే దేవుడు హనుమంతుడు. భారతదేశంలో హిందువులు ఉన్న ప్రతీ చోటా తప్పకుండా ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది. త్రేతాయుగం నాటి హనుమంతుడు.. కలియుగంలో కూడా జీవించి ఉన్నాడనేది హిందువుల నమ్మకం. ఆంజనేయుడికి మరణం లేదనేది వారి విశ్వాసం. అలాంటి ఆంజనేయుడి పాత్రను ప్రభాస్ నటించే ఆదిపురుష్ మూవీలో దేవ్ దత్త గజానన్ నాగే అనే నటుడు చేశాడు. ప్రస్తుతం ఈ నటుడి గురించి సోషల్ మీడియాలో అందరూ ఆరా తీస్తున్నారు.

Advertisement

ఆదిపురుష్ మూవీ చేసేంత వరకు ఈయన పేరు పెద్దగా ఎవ్వరికీ పరిచయం లేదు. ఆదిపురుష్ లో హనుమంతుడి పాత్ర ఈ నటుడు అని తెలియాగానే సెర్చ్ చేయడం ప్రారంభించారు. అంతగా పాపులర్ కానీ నటుడిని హనుమంతుడి పాత్రకు దర్శకుడు ఓంరౌత్ ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్న తలెత్తింది. అయితే దేవ్ దత్త నాగే ఓ మరాఠి నటుడు. మహారాష్ట్రలోని అలీబాగ్ లో 1981లో ఫిబ్రవరి 05న జన్మించాడు. ప్రస్తుతం ఈయన వయస్సు 42 ఏళ్లు. బీఎస్సీ, ఎల్ఎల్బీ కూడా పూర్తి చేశాడు. 2010లో కంచన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు నిహార్ అనే కొడుకు ఉన్నాడు.

Advertisement

ప్రస్తుతం వీరు ముంబైలో నివసిస్తున్నారు. 2011లో హిందీ సీరియల్ వీర్ శివాజీలో తానాజీ పాత్ర పోషించడం వల్ల అతను తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఓం రౌత్ తెరకెక్కించిన తానాజీ సినిమాలో మరాఠా యోధుడు సూర్యాజీ పాత్రను పోషించాడు. ముఖ్యంగా వీరుడి పాత్రను దేవ్ దత్త నాగే పోషించిన విధానం ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకుంది. అజయ్ దేవ్ గణ్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై సినిమాతో బాలీవుడ్ కి అడుగుపెట్టాడు. తానాజీ మూవీలో సూర్యాజీగా అతని పర్మార్మెన్స్ కి ఇంప్రెస్  అయిన ఓంరౌత్ ఆదిపురుష్ లో అత్యంత కీలకమైన హనుమాన్ రోల్ కి ఎంచుకున్నాడు.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా సినీ గోయర్స్ దృష్టిలో పడ్డాడు. హనుమంతుడి పాత్ర కోసం శారీరకంగా అతను చాలా కష్టపడ్డాడు. 2011 నాటికి ఇప్పటికీ తన శరీరాకృతిలో వచ్చిన మార్పులను ఫొటోల ద్వారా ఇటీవలే బయటపెట్టాడు. అతను తొలిసారి వ్యాయామంలో ట్రైనింగ్ తీసుకున్న జిమ్ పేరు హనుమాన్ వ్యాయామశాల. హనుమంతుడి పేరుతో అతనికి అనుబంధం ఏర్పడిందన్న మాట. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ మూవీ విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆ రోజు నుంచి హనుమాన్ గా ప్రేక్షకులు దేవ్ దత్తకు తమ హృదయాల్లో చెరిగిపోని స్థానం ఇస్తారని చెప్పవచ్చు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?

 ‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

Visitors Are Also Reading