Home » ‘అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!

‘అతని కొడుకు కోసం నా కెరీర్ నాశనం చేశాడు’.. అంబటి రాయుడు సెన్షేషన్ కామెంట్స్..!

by Anji
Ad

భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ వల్లనే తాను టీమిండియాకి సుదీర్ఘకాలం పాటు ఆడలేకపోయానని తెలిపాడు అంబటి రాయుడు. తన కుమారుడు అర్జున్ యాదవ్ కోసం శివలాల్ యాదవ్ తన కెరీర్ కి అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికి అంబటిరాయుడు.. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ఓ తెలుగు ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Advertisement

ఈ సందర్భంగా రాయుడు మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నా చిన్నప్పటి నుంచి రాజకీయాలున్నాయి. శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్ ని టీమిండియాకి ఆడించాలనే ఉద్దేశంతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అర్జున్ యాదవ్ కంటే నేను మెరుగ్గా ఆడుతుండటంతో నన్ను అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికీ నా వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. దీంతో అర్జున్ యాదవ్ త్వరగా టీమిండియాకి ఎంపికవ్వాలని నేను కోరుకునేవాడిని. భారత్ కి ఆడటం వాడి వల్ల కాలేదు. హెచ్ సీఏలో నా చిన్నతనంలోనే క్యాన్సర్ ప్రారంభమైంది. ఇప్పుడు నాలుగో స్టేజీకి చేరుకుంది. బీసీసీఐ జోక్యం చేసుకుంటేనే పరిస్థితి మారుతుంది. లేకుండా హెచ్ సీఏను ఎవ్వరూ బాగుచేయలేరు.

Advertisement

2003-04 లో భారత్ ఏ జట్టు తరుపున అద్బుతంగా ఆడాను. కానీ 2004 సెలక్షన్స్ కమిటీ మారడం.. శివలాల్ యాదవ్ సన్నిహితులు ప్యానెల్ లోకి రావడంతో నాకు అవకాశాలు దక్కలేదు. నన్ను ఎందుకు ఎంపిక చేయలేదని అడగడం కూడా తప్పు అయింది. నాలుగేళ్ల పాటు ఎవరినీ నాతో మాట్లాడనీయకుండా మ్యాచ్ కి ముందు రోజు శివలాల్ యాదవ్ తమ్ముడు తాగి వచ్చి ఇంటి ముందు బండ బూతులు తిట్టేవాడు. మానసికంగా నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అందరూ అణిగిమణిగి ఉండాలంటారు. కానీ తప్పు జరిగిందని అనుకున్నప్పుడు కూడా అడగకపోతే ఎలా . ఏడేళ్ల పాటు ఫొన్ కూడా వాడలేదు. దీంతో వారికి నాపై చాలా కోపం ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్ కి మారిన తరువాతనే నాకు రావాల్సిన గుర్తింపు లభించింది. ఇన్నేళ్ల నా ఆటకు గుర్తింపుగా ధోనీ నన్ను వేదిక మీదకు పిలిచి ట్రోఫీని అందుకోమని చెప్పాడు” అని రాయుడు చెప్పుకొచ్చాడు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

“మీ ఐరెన్ లెగ్ వల్లే టీం ఇండియా ఓడిపోయింది” అంటూ అనుష్క శర్మని తిట్టిపోస్తున్న నెటిజన్స్!

న్యూమరాలజీ అనాలసిస్: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమికి ఇదే కారణం.. జులై నుంచి కోహ్లీ, రోహిత్ లకు?

Visitors Are Also Reading