Home » సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?

సమంత దారిలోనే లావణ్య త్రిపాఠి.. ఇదే నిజమవుతుందా ?

by Anji
Ad

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నిశ్చితార్థం హైదరాబాద్ లో జూన్ 09న జరిగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టుబోతున్నారు. మిస్టర్ మూవీ సమయంలోనే వరుణ్, లావణ్య ఒకరికొకరు ఇష్టపడ్డారు. దాదాపు ఏడేళ్ల కాలం ప్రేమించుకున్నా కానీ ఎవ్వరి కంట పడకుండా రహస్యంగా మెయింటైన్ చేశారు.  తాజాగా వీరు పెళ్లికి సిద్ధమయ్యారు. 

Varun-Lavanya

Advertisement

 

ఇదిలా ఉండగా.. లావణ్య త్రిపాఠి తమ ఇంటికి కోడలుగా రావాలంటే మెగా ఫ్యామిలీ నుంచి కండీషన్స్ పెట్టారట. సినిమాలు చేయకూడదని చెప్పినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తనకు ఇష్టమైన క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేందుకు అభ్యంతరం చెప్పవద్దని.. అదేవిధంగా సినిమా ప్రొడక్షన్ లో తాను కొనసాగుతాననే కండీషన్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఈ తరుణంలోనే లావణ్య తాజాగా ఒకేసారి మూడు ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పింది. లావణ్య చేయబోతున్నటువంటి మూవీస్ కి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించింది పీఆర్ టీమ్. తమిళంలో అధర్వతో ఓ సినిమా చేయనుంది. అదేవిధంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేస్తుందట లావణ్య. దీంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్, హాట్ స్టార్ కాంబోలో వస్తున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుందట లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ మూడు కమిట్ అయిన ప్రాజెక్ట్ లు అని వెల్లడించింది. లావణ్యకి మెగా ఫ్యామిలీ పెట్టిన కండీషన్స్ కేవలం రూమర్స్ అనే స్పష్టమవుతోంది. 

Advertisement

అవి ఎంగేజ్ మెంట్ కి ముందే ఒప్పుకున్న సినిమాలు. దీంతో ఈ సినిమాలు చేసి లావణ్య యాక్టిం్ కి గుడ్ బై చెబుతుందా ? లేక అలాగే కంటిన్యూ అవుతుందా ? అనేది మాత్రం సస్పెన్స్ గానే మారింది. సమంత, నయనతార, కాజల్ వంటి కథానాయికలు పెళ్లి చేసుకున్న తరువాత సినిమాల్లో నటిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సినిమాల్లో నటిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వారు మారుతూ మూవ్ అవుతున్నారు. వారి భర్తల సహకారంతో ముందుకు సాగుతున్నారు. సమంత పెళ్లి తరువాత చాలా సినిమాలు చేసింది. నాగచైతన్యతో పాటు ఇతర హీరోలతోనూ నటించింది. మరోవైపు నయనతార సైతం ఎలాంటి అభ్యంతరం లేకుండా సినిమాలను చేస్తుంది. కాజల్ కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లో కాస్త బిజీ అవుతోంది. లావణ్య త్రిపాఠి కూడా వీరి దారిలోనే పయనిస్తుందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు మాత్రమే చేసి యాక్టింగ్ మానేస్తుందా ? లేక అలాగే సినిమాలను కంటిన్యూ చేస్తుందా అనేది మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ‘అవతార్’ అభిమానులకు చేదువార్త.. ‘అవతార్’ 3,4,5 విడుదల తేదీలలో భారీ మార్పులు..!

చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం.. లేదంటే ఆ సమస్యలు తలెత్తడం పక్కా..!

Visitors Are Also Reading