Telugu News » షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గురించి తెలుసా? ఆమె శాలరీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గురించి తెలుసా? ఆమె శాలరీ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!

by Srilakshmi Bharathi

“కింగ్ ఆఫ్ బాలీవుడ్” అని పిలుచుకునే షారుఖ్ ఖాన్ మేనేజర్ ఎవరో తెలుసా? ఆమె పేరు పూజ దద్లానీ. ప్రతి పాపులర్ యాక్టర్ వెనుక అమితమైన ప్రతిభ కలిగిన టీం ఉంటుంది. ఆ టీం సపోర్ట్ తో వారు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతుంటారు. షారుఖ్ ఖాన్ అందుకు భిన్నం ఏమీ కాదు. ఆయనకు కూడా తన సపోర్టివ్ టీం ఉంటారు. ఆయన మేనేజర్ పూజ దద్లానీ గురించి చాలా మందికి తెలియదు.

ఆమె షారుఖ్ ఖాన్ కెరీర్ కు సంబంధించి అన్ని విషయాలలోనూ తన సాయాన్ని అందిస్తారు. తన డ్యూటీని నిర్వర్తిస్తూ ఆయన టీం లో కీలకమైన మెంబెర్ గా పూజ నిలిచారు. షారుఖ్ కు సంబంధించిన నటన, నిర్మాణం, స్పాన్సర్‌షిప్‌లు మరియు ఇతర ప్రోగ్రామ్స్ కు సంబంధించి అన్ని షెడ్యూల్స్ ను ప్లాన్ చేయడంలోను, టైం ప్రకారం ఇంప్లిమెంట్ చేయడంలోనూ పూజ కీలక పాత్ర పోషిస్తారు.

షారుఖ్ యొక్క వృత్తిపరమైన మరియు వ్యక్తిగత అంశాలు సజావుగా సాగేలా దద్లానీ కేర్ తీసుకుంటారు. ఖాన్ స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకుని పూజ పని చేస్తారు. పూజా దద్లానీ షారుఖ్ యొక్క ప్రతి కదలికకు బాధ్యత వహిస్తారు. షారుక్ ఖాన్ మరియు పూజ పదేళ్లకు పైగా సహచరులు. షారుఖ్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వ్యవహారాలన్నింటిని ఆమె చూసుకుంటుంది. ఆమె సంవత్సరంలో చాలా రోజులు 24 గంటల పాటు షారుఖ్ తోనే ఉంటుంది. ఆమె కష్టానికి, షారుఖ్ ఖాన్ తన మేనేజర్‌కు మంచి జీతం కూడా ఇస్తాడు. దద్లానీ నికర విలువ రూ. 45 మరియు 50 కోట్లు. ఆమె కోట్లలో జీతం అందుకుంటుంది. సంవత్సరానికి ఆమె జీతం 7 నుండి 9 కోట్లుగా ఉంది.

మరిన్ని..

పెళ్లైన 5 నెలలకే విడాకులకు రెడీ అయిన టాలీవుడ్‌ డైరెక్టర్ ?

అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి కళ్ళు చిదంబరంను అవమానించిన విషయం మీకు తెలుసా ?

Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్

Visitors Are Also Reading