Home » పెళ్లైన 5 నెలలకే విడాకులకు రెడీ అయిన టాలీవుడ్‌ డైరెక్టర్ ?

పెళ్లైన 5 నెలలకే విడాకులకు రెడీ అయిన టాలీవుడ్‌ డైరెక్టర్ ?

by Bunty

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమంలో విడాకులు చాలా కామన్‌ అయిపోయాయి. చిన్న చిన్న గొడవలకు విడాకుల వరకు వెళ్తున్నారు. మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా కోలివుడ్ మరియు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మన చిత్ర పరిశ్రమంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని కొంతమంది రెండో పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది సింగిల్ గా ఉన్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు… కానీ కొంతమంది మాత్రం పెళ్లిని చాలా చీప్ గా చేసేసి… సింపుల్గా విడాకులు తీసుకుంటున్నారు.

Young Director Heading For Divorce

Young Director Heading For Divorce

ఈ జాబితాలో మొదటగా సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున నుంచి…. మెగా డాటర్ కొణిదల నిహారిక వరకు చాలామంది విడాకులు తీసుకున్నారు. కొణిదల నిహారిక మరియు జొన్నలగడ్డ వెంకట చైతన్య సింపుల్ రీజన్స్ తో విడిపోయారు. అటు అక్కినేని నాగచైతన్య మరియు సమంత కూడా అసలు కారణాలు చెప్పకుండానే విడాకులు తీసుకున్నారు. కలర్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ యంగ్ దర్శకుడు కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడట. అతనికి పెళ్లి అయి… ఐదు నెలలు మాత్రమే గడిచిందట. అంతేకాదు ఆ దర్శకుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకున్నాడట. కానీ పెళ్లి అయిన ఐదు నెలల నుంచి ఇప్పటివరకు తన భార్యతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఇందులో భాగంగానే తాజాగా కోర్టు ను కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ యంగ్ దర్శకుడు ఎవరు అని అందరూ సెర్చ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్

Chandrababu Arrest : చంద్రబాబు కు 10 ఏళ్ల జైలు శిక్ష ..!

Astrology: కలలో ఇవి కనిపించటం లక్ష్మీదేవి రాకకు సంకేతం..!

Visitors Are Also Reading