Home » అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి కళ్ళు చిదంబరంను అవమానించిన విషయం మీకు తెలుసా ?

అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి కళ్ళు చిదంబరంను అవమానించిన విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలలో నటులలో రకరకాలుగా ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరికొందరూ అన్ని పాత్రల్లో లీనమైపోతుంటారు. అయితే తనలో టాలెంట్ ఉండాలి కానీ అందం, ఐశ్వర్యం అనేది అస్సలు పనికిరాదు అని నిరూపించారు ఈ కమెడియన్. బాబు మోహన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు వంటి తరం నటులతో సమానంగా పేరు సంపాదించుకున్న నటుడు కళ్ళు చిదంబరం. అప్పట్లో ఈయన సినిమాల్లో ఉన్నాడంటే.. తప్పనిసరిగా ప్రేక్షకులు పగలబడి నవ్వేవారు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల ముఖంలో నవ్వులు చిందించేలా చేశారు. అలాంటి కళ్ళు చిదంబరం దాదాపు 300 సినిమాలకు పైగా నటించారు. అలాంటి ఆయన ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టాలు పడ్డారట. ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా అవమానాలు ఎదుర్కున్నారట. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కళ్ళు చిదంబరం అసిస్టెంట్ ఇంజినీర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన ఉద్యోగం చేస్తూనే.. నటనపై ఉన్న ఆసక్తితో నాటికల్లో నటించేవారట. అలా మెల్లగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి నటించిన కళ్ళు అనే మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించడంతో కళ్ళు చిదంబరంగా మారిపోయారు. ఇందులో నటనకు నంది అవార్డు కూడా లభించింది. చిరంబరం వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా గోవిందా గోవిందా అనే సినిమా చేస్తున్నారు. ఇందులో కళ్ళు చిదంబరం కూడా కమెడీయన్ గా మంచి పాత్ర ఉంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో చిదంబరం ముందుగానే సెట్ లోకి వచ్చారు.

Advertisement

ఇక ఆ తరువాత శ్రీదేవి సెట్ లోకి వచ్చి కళ్లు చిదంబరం ను చూసి నేను ఆయనతో నటించను అని చెప్పిందట. మరీ ఆయన కళ్లు చూసి భయపడిందో ఏమో కానీ.. నటించను అని చెప్పే సరికి వర్మ చాలా కోపానికి గురయ్యారట. ఆయన సినిమాలో ఉంటేనే నేను డైరెక్టన్ చేస్తాను.. నంది అవార్డు గ్రహీత గొప్ప నటుడు ఆయన లేకుంటే ఈ సినిమానే ఆపేస్తానని శ్రీదేవితో చిదంబరం వర్మ గట్టిగా చెప్పారట. అప్పుడు శ్రీదేవి ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆశ్చర్యపోయిందట. ఆ తరువాత కళ్ళు చిదంబరంకి సారి చెప్పి ఆ సినిమాలో నటించిందట శ్రీదేవి. అప్పటి నుంచి చిదంబరం ఎక్కడ కనిపించినా శ్రీదేవి చాలా గౌరవంగా మాట్లాడేదని చిదంబరం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

మరికొన్ని వార్తలు :

Rajinikanth : గుడిలో పూజారికి దక్షిణ వేసిన తలైవా రజనీకాంత్

 రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..?

 

Visitors Are Also Reading