Home » కోహ్లీ అంత గొప్ప కెప్టెన్ కాదు అంటున్న సెహ్వాగ్.. ఎందుకంటే..?

కోహ్లీ అంత గొప్ప కెప్టెన్ కాదు అంటున్న సెహ్వాగ్.. ఎందుకంటే..?

by Azhar
Ad

భారత మాజీ ఓపెనర్.. ప్రస్తుత కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ అప్పట్లో తన బ్యాటింగ్ తో వార్తల్లో నిలుస్తుంటే.. ఇప్పుడు మాత్రం తన కామెంట్స్ తో నిలిస్తున్నాడు. ఎప్పుడు ఏదో అంశం పైన సెహ్వాగ్ స్పందించడం అది వైరల్ కావడం జరుగుతుంది. ఇక తాజాగా విరాట్ కోహ్లీ అంత గొప్ప కెప్టెన్ కాదు అని సెహ్వాగ్ అన్నాడు. తాజాగా ఈ విషయంలో ఈ డ్యాశింపఁ ఓపెనర్ మాట్లాడుతూ.. ఎప్పుడైనా సరే ఓ నెంబర్ వన్ కెప్టెన్ అనే అతను తన జట్టును నిర్మించడమే కాకుండా ఆ జట్టులో ఆడే ప్రతి ఆటగాడికి అండగా నిలవాలి. వారందరికీ నమ్మకం కల్పించాలి.

Advertisement

కానీ కోహ్లీ అలా చేయలేదు. విరాట్ ఎప్పుడు కొంతమంది ఆటగాళ్లకే మద్దతుగా నిలిచాడు. కారణాలు ఏవో తెలియవు కానీ.. అతను చాలా మంది ఆటగాళ్లను పట్టించుకోలేదు అని సెహ్వాగ్ అన్నాడు. మీరు గంగూలీని చూడండి. అతను ఓ కొత్త భారత జట్టును తాయారు చేసాడు. కానీ కోహ్లీ అలా చేశాడా…? అంటే నాకు అనుమానమే. గంగూలీ తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు కొత్త కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చాడు. కొత్తలో వారందరికీ అండగా నిలిచాడు. వారు రాణించిన.. రాణించకపోయిన వారితో ఒకేలా ఉన్నాడు. కానీ కోహ్లీ అలాగే చేశాడా అనేది నాకు తెలియదు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Advertisement

అయితే 2014 లో భారత టెస్ట్ కెప్టెన్ అయిన కోహ్లీ 2017 లో అన్ని ఫార్మట్స్ లో టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత రెండేళ్లు బాగానే ఉన్న ఆ తర్వాత అతని కెప్టెన్సీ పై విమర్శలు మొదలలై. దాంతో గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మాట్ లో భారత జట్టు కెప్టెన్ గా తప్పుకున్న విరాట్ ను తర్వాత బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓడిన తర్వాత ఈ లాంగ్ ఫార్మాట్ లో కూడా కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

భువీతో ఆ విషయంలో ఎప్పుడు గొడవే…!

ఐపీఎల్ లో మరో అంపైర్ తప్పిదం.. బలైన మాథ్యూ వేడ్..!

Visitors Are Also Reading