Home » ఐపీఎల్ లో మరో అంపైర్ తప్పిదం.. బలైన మాథ్యూ వేడ్..!

ఐపీఎల్ లో మరో అంపైర్ తప్పిదం.. బలైన మాథ్యూ వేడ్..!

by Azhar
Ad

ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్15 సీజన్ లో అంపైర్ తప్పిదాలు ఆగడం లేదు, సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుండి ఇప్పుడు ముగింపు దశకు వచ్చిన తర్వాత కూడా అంపైర్లు తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. వీరి తప్పుల కారణంగా చాలా మంది బ్యాటర్లు బలికగా… మాస్క్ ల ఫలితాలు కూడా మారిపోతున్నాయి. ఇక ఈరోజు గుజరాత్ టైటాన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కూడా అంపైర్ మరో తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. ఆయా నిర్ణయాన్ని మాథ్యూ వేడ్ బలైపోయాడు.

Advertisement

అయితే నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న గుజరాత్ జట్టులో ఓపెనర్ గిల్ ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చాడు మాథ్యూ వేడ్. వచ్చే ఎదుర్కొన 13 బంతుల్లో 16 పరుగులు చేసిన తర్వాత.. 5 ఓవర్ 2వ బంతికి అంపైర్ మాథ్యూ వేడ్ ను ఔట్ గా ఇచ్చాడు. దాంతో మాథ్యూ వేడ్ రివ్యూ తీసుకోగా… అందులో బాల్ బ్యాట్ పక్కలనుండి వెళ్ళినప్పుడు… లైన్ లో చిన్న స్పర్క్ వచ్చింది. దాంతో తాను నాట్ ఔట్ అనుకున్న మాథ్యూ వేడ్ కు థర్డ్ ఎంపైర్ షాక్ ఇచ్చాడు. ఔట్ గా ప్రకటించాడు.

Advertisement

దాంతో అసహనానికి లోనైనా మాథ్యూ వేడ్ గ్రౌండ్ నుండి చాలా నిరాశగా బయటికి వచ్చిన తర్వాత డ్రెసింగ్ రూమ్ లో తన కొప్పని ప్రదర్శించాడు. వచ్చిరాగానే తన బ్యాట్ ను విసిరేసిన మాథ్యూ వేడ్.. తనకు ఉన్న మొత్తం బలంతో హెల్మెట్ ను అక్కడే ఉన్న కూర్చులో విసిరేసాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలే ఈ ఐపీఎల్ లో రాణించలేకపోతున్న మాథ్యూ వేడ్ కు ఈ నిర్ణయం మరింత కొప్పని తెప్పించి ఉంటుంది అని కామెంటేటర్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

భువీతో ఆ విషయంలో ఎప్పుడు గొడవే…!

Visitors Are Also Reading