భారత జట్టులో స్టార్ ఆటగాళ్ల లిస్ట్ లో బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉంటాడు. జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లు తీయడం మాత్రమే కాకుండా… బుమ్రాతో కలిసి డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ గా కూడా ఉండేవాడు. కానీ ఈ మధ్య జట్టులో స్థానం కోల్పోయిన భువీ మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున రాణిస్తున్నాడు. అయితే భువీ భారత జట్టులో స్థానం కోల్పోవడానికి ముఖ్య కారణం అతని ఫిట్నెస్ మాత్రమే. దాదాపు ఒక్క సిరీస్ కు తప్పించి మరో సిరీస్ కు భువీ గాయపడటమే అతడిని జట్టు దూరం చేసింది.
Advertisement
ఇక తాజాగా ఇదే విషయం పై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ… నేను టీం ఇండియా తో ఉన్నపుడు నాకు భువీతో ఎప్పుడు ఈ ఫిట్నెస్ విషయంలో ఎక్కువగా గొడవ జరిగేది. నాకు అతని బౌన్గ్ తో ఎటువంటి సమస్య లేదు. కానీ నా సమస్య మొత్తం అతని ఫిట్నెస్ తోనే అని రవిశాస్త్రి అన్నారు. అతనికి ఉన్న అనుభవం అలాగే స్కిల్స్ అసాధారణం అని నేను చెప్పగలను. అయితే భువీ గనక తన ఫిట్నెస్ ను స్థిరంగా ఉంచుకోగలిగితే తప్పకుండ భారత జట్టుకు అన్ని ఫార్మట్స్ లో ఆడగలడు.
Advertisement
ఇప్పుడు అతని సహచర బౌలర్ బుమ్రా అలానే చేస్తున్నాడు. భువీకి కూడా అన్ని ఫార్మట్స్ లో ఆడే సామర్థ్యం ఉంది. కానీఫిట్నెస్ లేదు. మేము న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి భువీ గాయపడి జట్టుకు దూరం అవుతూ ఉండేవాడు. అతను ఫిట్ గా ఉండే గత రెండేళ్లలో భారత టెస్టు జట్టులో ఆడుతూ కనీసం 50 వికెట్లు తీసేవాడు. ఇప్పటికి కూడా అతను తన ఫిట్నెస్ ను నిరూపించుకుంటే.. తప్పకుండా భారత జట్టులోకి వస్తాడు అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
పాకిస్థాన్ కు ఫైన్ కడుతున్న న్యూజిలాండ్… ఎందుకంటే…?
Advertisement
ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!