Telugu News » Blog » నా భర్తను అవమానించారంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ పై సంజూ భార్య ఆగ్రహం..!

నా భర్తను అవమానించారంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ పై సంజూ భార్య ఆగ్రహం..!

by Manohar Reddy Mano

ఐపీఎల్ 2022 లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్స్ కు చేరింది. ఆ జట్టులో బ్యాటర్లు, బౌలర్లు అందరూ కలిసి రాణిస్తుండటంతో.. పెద్ద పెద్ద జట్లకు కూడా చుక్కలు చూపించింది రాజస్థాన్. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ లలో 9 విజయాలు నమోదు చేసిన ప్లే ఆఫ్స్ కు చేరింది. అక్కడ క్వాలిఫైర్స్ 1 లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. క్వాలిఫైర్స్ 2 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై అద్భుతమైన విజయం సాధించి ఫైనల్స్ లోకి వచ్చింది.

Ads

ఈ క్రమంలో నా భర్తను అవమానించారంటూ ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్ పై రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్ భార్య చారులత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో బ్రాడ్‌కాస్టర్స్ లో కార్టూన్ ప్రోమో విడుదల చేసారు. అందులో మిగిలిన 9 జట్ల కెప్టెన్లు ఉన్నారు కానీ రాజస్థాన్ కాప్రిన్ సంజూ మాత్రం కనిపించలేదు. దీనిపై తాజాగా చారులత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో ‘ నేను ఈ ఐపీఎల్ ప్రారంభం సమయంలో ఈ వీడియో చూసాను. కానీ ఇందులో రాజస్థాన్ పింక్ జెర్సీలోని కెప్టెన్ ఎందుకు కనిపించే లేదో నాకు ఇంకా అర్థం కావడం లేదు…’ అంటూ పేర్కొంది సంజూ భార్య.

Ads

అయితే ఐపీఎల్ మొదటి సీజన్ 2008 తర్వాత రాజస్థాన్ జట్టు మళ్ళీ ఇప్పుడే ఫైనల్స్ కు వెళ్ళింది. దాంతో మొదట్లో ఆ జట్టు కెప్టెన్ సంజూని తక్కువ అంచనా వేసినవారు అందరూ ఇప్పుడు ముక్కున వేలు వేసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా జట్టును ఫైనల్స్ కు చేర్చిన సంజూ ఈరోజు ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను కూడా ఓడించి టైటిల్ సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. ఈ మ్యాచ్ ఈరోజు అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. చూడాలి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

ఇవి కూడా చదవండి :

మేము ఇన్నింగ్స్ ఆడలేం అనుకున్నారు.. అందుకే ఆడుతున్నారు..!

ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో ఎవరికీ ఎంత ప్రైజ్‌మనీ అంటే..?