Telugu News » Blog » ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో ఎవరికీ ఎంత ప్రైజ్‌మనీ అంటే..?

ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో ఎవరికీ ఎంత ప్రైజ్‌మనీ అంటే..?

by Manohar Reddy Mano
Ads
ఐపీఎల్ 2022 సీజన్ నేటితో ముగిసిపోనుంది. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు ఫైనల్స్ లో టైటిల్ కోసం తలబడబోతున్నాయి. అయితే ఐపీఎల్ ప్రారంభించిన 2008 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫైనల్స్ లోకి వచ్చిన రాజస్థాన్ ఎలాగైనా టైటిల్ కొట్టాలి అనుకుంటుంటే… ఈ ఏడాదే ఐపీఎల్ లో అడుగు పెట్టి లీగ్ దశలో అద్భుతమైన ప్రదర్శన చేసిన గుజరాత్ టైటిల్ కొట్టి రికార్డు నెలకొల్పాలి అనుకుంటుంది. అయితే ఈ ఐపీఎల్ 2022 ఫైనల్స్ లో ఎవరికీ ఎంత ప్రైజ్‌మనీ వస్తుందో ఇప్పుడు చూద్దాం..!
గుజరాత్ – రాజస్థాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు టైటిల్ తో పాటుగా 20 కోట్ల భారీ ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇక ఓడిన జట్టుకు 13 కోట్లు వస్తాయి. అలాగే ఈ సీజన్ లో మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జట్లకు కూడా ప్రైజ్‌మనీ ఉంటుంది. మూడో స్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు 7 కోట్లు అందుతుండగా.. నాలుగో స్థానంలో ఉన్న మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెంట్స్ కు 6.5 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ ఉంటుంది.
అలాగే ఐపీఎల్ లో ఇచ్చే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ కూడా ప్రైజ్‌మనీ ఉంటుంది. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ఆరెంజ్ క్యాప్ ఇస్తారు. ఇది ఇప్పటికే బట్లర్ కు ఖాయం అయ్యింది. దాంతో బట్లర్ కు 15 లక్షల ప్రైజ్‌మనీ అందుతుంది. అలాగే అత్యధిక వికెలు తీసిన బౌలర్ కు పర్పుల్ క్యాప్ తో పాటుగా 15 లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇందుకోసం పోటీలో హాసరంగా, చాహల్ ఉన్నారు. ఈ ఇద్దరు 26 వికెట్లతో సమానంగా ఉన్న ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హాసరంగా దగ్గర ఉంది. నేడు ఫైఅన్నాళ్ళు లో చాహల్ ఒక్క వికెట్ తీసిన పర్పుల్ క్యాప్ తో పాటుగా ప్రైజ్‌మనీ కూడా అతనికి వెళ్తుంది.