Home » ఐసొలేషన్ నుండి రోహిత్ కు విముక్తి..!

ఐసొలేషన్ నుండి రోహిత్ కు విముక్తి..!

by Azhar
Ad

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియాకు అలాగే అభిమానులకు టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు.. ఓ చేదు వార్త అనేది చెప్పింది బీసీసీఐ. అదే భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అని ప్రకటించింది. ఇది జట్టుతో పాటు అభిమానులకు కూడా పెద్ద దెబ్బ. ఎందుకంటే.. గత ఏడాది కూడా కరోనా కారణంగా వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ను ఇప్పుడు నిర్వహిస్తుంటే.. ఇప్పుడు కూడా కరోనా ఏంటి అనుకున్నారు. అలాగే రోహిత్ లేకపోతే టీం ఇండియా పరిస్థితి ఏంటి.. ఓపెనర్ ఎవరు.. ఇప్పుడు జట్టుకి కెప్టెన్ ఎవరు అనే చాలా ప్రశ్నలు వచ్చాయి.

Advertisement

ఇక కరోనా వచ్చిన రోహిత్ ను ఐసోలేషన్ లో ఉంచి బీసీసీఐ.. ఇక్కడ అతని స్థానంలో ఓపెనర్ గా పుజారాను అలాగే కెప్టెన్ గా బుమ్రాను నియమించింది.అయితే ఇప్పుడు మళ్ళీ టీం ఇండియా ఫ్యాన్స్ కు అలాగే రోహిత్ ఫ్యాన్స్ కు ఓ శుభవార్త అనేది వచ్చింది. అదేంటంటే.. రోహిత్ శర్మ ఈ కరోనా బారి నుండి బయట పడ్డాడు. తాజాగా రోహిత్ శర్మ హోటల్ లో తన ఐసోలేషన్ ను పూర్తి చేసుకొని బయటకు వచ్చి.. బస్సు ఎక్కుతున్న ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నేటితో రోహిత్ జట్టుకి అందుబాటులో ఉండబోతున్నాడు.

Advertisement

అయితే ఈ పర్యటనలో కేవలం ఈ టెస్ట్ మ్యాచ్ మాత్రమే కాకుండా టీ20, వన్డే సిరీస్ కూడా ఆడబోతుంది భారత జట్టు. ఇందులో టీం ఇండియాను రోహిత్ శర్మనే కెప్టెన్ గా నడిపించబోతున్నాడు. ఈ మధ్యే ఇందుకు సంబంధించినా జట్టును, షెడ్యూల్ ను కూడా బీసీసీఐ ప్రకటించింది. దీని ప్రకారం టెస్ట్ తర్వాత మొదట టీ20 సిరీస్ లో మూడు మ్యాచ్ లను ఈ నెల 7, 9, 10 తేదీలలో జరగనుండగా.. ఆ తర్వాత 12, 14, 17 తేదీలో మూడు వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలబడబోతుంది. ఇక ఈ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్తుంది భారత జట్టు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ వైఫల్యం పై జడేజా షాకింగ్ కామెంట్స్…!

నా భార్య కోసమే టైం లేదు.. ఇక ఐపీఎల్ కోసం ఎక్కడిది..?

Visitors Are Also Reading