Telugu News » Blog » నా భార్య కోసమే టైం లేదు.. ఇక ఐపీఎల్ కోసం ఎక్కడిది..?

నా భార్య కోసమే టైం లేదు.. ఇక ఐపీఎల్ కోసం ఎక్కడిది..?

by Manohar Reddy Mano
Ads
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు ఉంది అనేది అందరికి తెలుసు. ఈ లీగ్ లో ఒక్క సీజన్ ఆడితే చాలు తమ దశ తిరిగిపోతుంది అని చాలా మంది ఆటగాళ్లు భావిస్తుంటారు. అందుకే ఐపీఎల్ వేలంలో ప్రపంచంలోని అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. ఈ ఐపీఎల్ కు క్యాష్ రిచ్ లీగ్ అనే మరో పేరు కూడా ఉంది. ఎందుకంటే… ఈ లీగ్ లో అంత డబ్బు అనేది ఉంటుంది. అందుకే పాకిస్థాన్ లాంటి దేశం వాళ్ల ఆటగాళ్లకు ఇందులో పాల్గొనే అవకాశం లేకపోవడంతో.. ఎప్పుడు ఐపీఎల్ పై బురద అనేది చల్లడానికి చూస్తుంటుంది.
ఇక ఇదిలా ఉంటె.. మేము ఈ ఐపీఎల్ లో ఆడలేకపోతున్నం అని చాలా మంది ఆటగాళ్లకు బాధపడుతుంటే.. ఐపీఎల్ లో ఆడే అవకాశం ఉన్న కూడా ఆడని ఆటగాళ్లు కొంతమంది ఉంటారు. వాళ్ళు అసలు ఐపీఎల్ వేలంలోనే పాల్గొన్నారు. అందులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఉంటాడు. స్టార్క్ ను ఐపీఎల్ లో చూడాలని చాలా మంది అనుకుంటుంటే.. అతను ఇందులో పాల్గొనడం లేదు. ఐపీఎల్ లో మాత్రమే కాదు.. స్టార్క్ ఆసీస్ నిర్వహించే బిగ్ బాష్ లీగ్ లో పాల్గొన్నాడు.  ఇప్పుడు ఉన్న అందరూ ఆటగాళ్లు డబ్బుల కోసం లీగ్ క్రికెట్ ఆడుతున్నారు.
కానీ నువ్వు ఎందుకు ఆడటం లేదు అని తాజాగా ఒక్కరు స్టార్క్ ను ప్రశ్నించగా.. గత కొన్నేళ్లుగా నా ఆలోచన ఈ లీగ్ క్రికెట్ పై మారిపోయింది. అందుకే ఏ లీగ్ లో పాల్గొనడం లేదు. నాకు నా దేశానికి ఆడటం చాలా ముఖ్యం. దేశం కోసం నా శక్తి మేర ఆడాలి. ఇంకా సమయం దొరికినప్పుడు నా భార్యను కూడా చూసుకోవాలి. కానీ నాకు అందుకు కూడా టైం సరిపోవడం లేదు. అయితే ఇప్పుడు మా జట్టు తీరికలేని క్రికెట్ ఆడుతుంది. కాబట్టి నేను నా జట్టుకు అందుబాటులో ఉండాలి అని స్టార్క్ చెప్పాడు. అయితే స్టార్క్ భార్య అలిస్సా హీలి కూడా ఒక్క క్రికెటర్. ఆమె ఆస్ట్రేలియా మహిళా జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతుంది.

Advertisement

You may also like