Home » పుష్ప 2లో జగపతిబాబు నటించే పాత్ర అదేనా ? 

పుష్ప 2లో జగపతిబాబు నటించే పాత్ర అదేనా ? 

by Anji
Ad

పుష్ప ది రైజ్ సినిమాతో సూపర్ హిట్ సాధించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇటు సుకుమార్.. అటు అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఫస్ట్ పార్ట్ కి మించేవిధంగా అంతకు మించి కలెక్షన్లు కుమ్మరించేలా ఈ సినిమాని చెక్కుతున్నారు. అందుకోసం క్రేజీ స్టార్లను ఈ సినిమాలో ఇంక్లూడ్ చేస్తున్నారనే టాక్ తో ఎప్పటి నుంచో నెట్టింట వైరల్ అవుతున్నారు. అదే నిజమన్నట్టు తాజాగా తన పుష్ప 2 సినిమాలో జగపతిబాబు తీసుకున్నారట ఈ దర్శకుడు. 

Also Read :  “ANR” వాళ్లను చూస్తే భయపడేవారట.. ఎందుకంటే..?

Advertisement

మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, కన్నడ హీరో ధనుంజయ్, సునిల్ తో పాటు తాజాగా ఈ సినిమాలో పుష్పరాజ్ వేటలో జగపతిబాబును కూడా దింపనున్నారట సుకుమార్. ఇప్పటికే ఈ విషయంపై సుక్కు తన మాట్లాడారని..తన క్యారెక్టర్ గురించి కూడా చెప్పారని తాజాగా జగ్గూ ఓ ఇంటర్వ్యూలో  హింట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ న్యూస్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

Also Read :  “దేవుళ్ళు”లో 2జడలు వేసుకొని ఎంతో క్యూట్ గా ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడెలా మారిందంటే..?

 

హీరో టూ విలన్ గా ట్రాన్స్ ఫాం అయి..సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో అదురగొడుతున్న జగపతిబాబు మరి పుష్ప 2 సినిమాలో ఇంకేరేంజ్ లో తన విలనిజం చూపిస్తారో అన్న కూడా క్యూరియాసిటీ కూడా ఇప్పుడు అందరినీ ఎగ్జైట్ అయ్యేవిధంగా జగపతి దెబ్బకు పుష్ప రాజ్ హీరోయిజం నెక్ట్స్ లెవల్ లో కనిపించడం ఖాయం అనే కామెంట్ నెట్టిట వస్తోంది. ఈ చిత్రంలో మరింత క్రూరంగా నటించనున్నారట జగపతి బాబు. గతంలో అరవింద సమేత సినిమాలో బాసిరెడ్డి పాత్రకు మించి పుష్ప 2లో వైల్డ్ గా కనిపించనున్నారట జగ్గుబాయ్. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాలంటే.. అప్ డేట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. 

Also Read :   హాస్పిటల్ లో సీనియర్ నటుడు శరత్ బాబు.. ఏమైంది ?

Visitors Are Also Reading