Home » బీసీసీఐపై ఇర్ఫాన్ ఫైర్.. ఎందుకు రెస్ట్..!

బీసీసీఐపై ఇర్ఫాన్ ఫైర్.. ఎందుకు రెస్ట్..!

by Azhar
Ad
బీసీసీఐ ప్రస్తుతం వ్యవరిస్తున తీరుపై చాలా విమర్శలు అనేవి వస్తున్నాయి. సీనియర్ ఆటగాళ్లను పక్కన బెట్టి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ ఉంది బీసీసీఐ. అయితే ఈ మధ్య భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నారు అనేది అందరికి తెలుసు. ఐపీఎల్ 2022 లో కూడా కోహ్లీ, రోహిత్ తమ స్థాయికి తగ్గిన ప్రదర్శన అనేది చేయలేదు. అందువల్ల వారు కొంత రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని సీనియర్లు సూచించారు. అందువల్ల ఐపీఎల్ తర్వాత జరిగిన టీ20 సిరీస్ లో సౌత్ ఆఫ్రికాపై కోహ్లీ, రోహిత్ తో పాటుగా బుమ్రాకు విశ్రాంతిని కల్పించారు బీసీసీఐ సెలక్టర్లు.
ఆ తర్వాత మళ్ళీ అందరూ ఆటగాళ్లతో కూడిన జట్టును ఇంగ్లాండ్ పర్యటనకు పంపారు. ఇక్కడ టెస్ట్ మ్యాచ్ కు రోహిత్ కరోనా వల్ల దూరం కాగా.. విరాట్ కోహ్లీ ఈ టెస్టులో విఫలమయ్యాడు. కానీ బుమ్రా మాత్రం రాణించాడు. దాంతో బీసీసీఐ మళ్ళీ మామూలుగానే జట్టును ఎంపిక చేస్తుంది అనుకున్నారు. ఇక అక్కడ వన్డే, టీ20 సిరీస్లకు అలాగే చేసింది. కానీ ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లబోయే వన్డే జట్టులో మాత్రం మళ్ళీ సీనియర్ ఆటగాళ్లను అందరిని పక్కకు పెట్టింది. ఈ టూర్ లో టీం ఇండియాకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు.
ఇక ఇప్పుడు ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆటగాళ్లు రాణించకపోతే వాళ్లకు రెస్ట్ ఇవ్వడం అనేది పనికిరాని పని. రెస్ట్ తీసుకోవడం వల్ల ఏ ఆటగాడు కూడా ఫామ్ లోకి రాడు అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఇక భారత అభిమానులు కూడా ఇదే విషయాన్ని బీసీసీఐకి చెబుతున్నారు. అయితే గత సిరీస్ లోనే రెస్ట్ ఇచ్చి మళ్ళీ అప్పుడే రెస్ట్ ఇవ్వడం ఏంటి అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ కప్ కు ముందు బీసీక్యూ ఇలా చేయడం జట్టుకు మంచిది కాదు అని అంటున్నారు.

Advertisement

Visitors Are Also Reading