Home » హాట్‌స్టార్‌కి భారీ నష్టం చేస్తున్న ఐపీఎల్..!

హాట్‌స్టార్‌కి భారీ నష్టం చేస్తున్న ఐపీఎల్..!

by Azhar
Ad

బీసీసీఐ నిర్వహిస్తున్న రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ హాట్‌స్టార్‌ కి భారీ నష్టం చేస్తున్నట్లు తెలుస్తుంది. 2008 లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది. దీనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. అయితే గత 5 ఏళ్ళ నుండి ఐపీఎల్ అనేది హాట్‌స్టార్‌ లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 తో ఐపీఎల్ ను ప్రసారం చేసే హాట్‌స్టార్‌ రైట్స్ అనేవి ముగిసిపోయాయి. దాంతో ఈ మధ్యే ఐపీఎల్ యొక్క ప్రసార హక్కుల వేలం అనేది బీసీసీఐ నిర్వహించింది.

Advertisement

ఇక ఈ వేలంలో పెద్ద పెద్ద కంపెనీలు అన్ని పోటీ పడ్డాయి. అందుకే ఐపీఎల్ రైట్స్ కు భారీ ధర అనేది వచ్చింది. మొత్తంగా ఈ వేలంలో 48 వేళా కోట్లకు పైగా ఆర్జించిన బీసీసీఐ… టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ అనేది విడివిడిగా అమ్మింది. అయితే ఇంత పోటీలో ఐపీఎల్ యొక్క టీవీ రైట్స్ అనేవి స్టార్ స్పోర్ట్స్ దకించుకుంది. కానీ డిజిటల్ రైట్స్ మాత్రం వయాకామ్ కు వెళ్లిపోయాయి. 23 వేళా కోట్ల కంటే ఎక్కువ ధర పలికి ఈ రైట్స్ ను గెలిచింది వయాకామ్ సంస్థ. ఈ కారణంగా హాట్‌స్టార్‌కి భారీ నష్టం వస్తుంది అని తెలుస్తుంది.

Advertisement

ఎందుకంటే.. ఇప్పటివరకు హాట్‌స్టార్‌ సబ్స్క్రైబర్స్ గా ఉన్న వాళ్లలో చాలా మంది ఐపీఎల్ కోసమే దానిని కొనుగోలు చేసారు. కానీ ఇప్పుడు ఐపీఎల్ డిజిటల్ రైట్స్ హాట్‌స్టార్‌ వద్ద లేకపోవడంతో సబ్స్క్రైబర్స్ మెల్లిమెల్లిగావెళ్ళిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల కాలంలోనే 20 నుండి 30 మిలియన్ సబ్స్క్రైబర్స్ హాట్‌స్టార్‌ కు గుడ్ బై చెప్పినట్లు సమాచారం. దీనితో పాటుగా ఈ ఏడాది ఐపీఎల్ 2022 అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు. ప్రజలు కూడా ఈసారి ఐపీఎల్ పై ఎక్కువ ఆసక్తి అనేది కనబరచలేదు. ఆ విధంగా కుడా హాట్‌స్టార్‌ కొంత నష్టపోయింది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ధోని హెయిర్ స్టైల్‌ మార్చడానికి దీపికానే కారణమా..?

కోహ్లీ భవిష్యత్తు ఈ రెండు సిరీస్లపైనే..!

Visitors Are Also Reading