Home » టీమిండియాకు మ‌రొక ఎదురుదెబ్బ‌.. శ్రీ‌లంక టూర్‌కు ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం

టీమిండియాకు మ‌రొక ఎదురుదెబ్బ‌.. శ్రీ‌లంక టూర్‌కు ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం

by Anji
Ad

శ్రీ‌లంక‌తో టీ-20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. మొద‌ట స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ దీప‌క్ చాహ‌ర్ గాయం కార‌ణంగా సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. అయితే ఇప్పుడు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ శ్రీ‌లంక సిరీస్ దూరం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. వెస్టిండిస్‌తో జ‌రిగిన టీ-20 సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ చేయ‌డంలో ఈ ఆట‌గాడు కీల‌క‌పాత్ర పోషించాడు. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి ఇరు దేశాల మ‌ధ్య మూడు టీ-20ల సిరీస్ ప్రారంభం కానుంది.

Also Read : చిరు’ గొప్ప నటుడా ? ‘మోహన్ బాబూ’ ? అన్న ప్రశ్న కి దాసరి గారు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా?

Advertisement

సిరీస్‌లో మొద‌టి మ్యాచ్‌లో ల‌క్నోలో జ‌ర‌గ‌నుండ‌గా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు ధ‌ర్మశాల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఏడాది చివ‌రిలో జ‌రగ‌నున్న టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌కు స‌న్న‌ద్ధం అవుతున్న భార‌త జ‌ట్టుకు ప్ర‌స్తుతం ప్ర‌తీ టీ-20 సిరీస్ ఎంతో కీల‌కం. ప్ర‌తి సిరీస్‌లో చేస్తున్న ప్ర‌యోగాల‌తో పాటు కీల‌క‌మైన ఈ టోర్నీకి జ‌ట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం సూర్య‌కుమార్ బృందంతో క‌లిసి ల‌క్నోలో ఉన్నారు. మంగ‌ళ‌వారం జ‌ట్టుతో క‌లిసి ప్రాక్టీస్ కూడా చేశాడు.

Advertisement

అత‌నికి గాయం కావ‌డంతో టీ-20 సిరీస్‌కు అన‌ర్హుడు అని తెలుస్తోంది. అత‌నికి గాయం ఎప్పుడు, ఎలా అయింద‌నే దానిపై మాత్రం ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. వెస్టిండిస్ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి సూర్య‌కుమార్ యాద‌వ్ 107 ప‌రుగులు చేశాడు. భార‌త్ త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. ఇటీవ‌లే దీప‌క్ చాహ‌ర్ కూడా గాయం కార‌ణంగా సిరీస్‌కు దూరమ‌య్యాడు. తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో కేవ‌లం 1.5 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. వెస్టిండిస్ తో జ‌రిగిన మూడ‌వ, చివ‌రి టీ-20 మ్యాచ్‌లో గాయ‌ప‌డిన అత‌ను మైదానం మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మించాడు.

Also Read :  అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ

Visitors Are Also Reading