Home » హరిహరకృష్ణ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వార్నింగ్.. ఎక్కడో తేడా..!

హరిహరకృష్ణ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు వార్నింగ్.. ఎక్కడో తేడా..!

by Anji
Ad

తాను ప్రేమించిన అమ్మాయిపై స్నేహితుడు మనసుపడ్డాడని పగతో రగిలిపోయి.. ‘గెట్ టూ గెదర్’ పేరుతో పిలిపించి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే పోలీసులు నిందితుడు హరిహరకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్ ని కేవలం హరిహరకృష్ణ ఒక్కడే Ha త్య చేశాడా.. లేక ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు హరిహరకృష్ణ గర్ల్ ఫ్రెండ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎక్కడో తేడా కొడుతుందని పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

మరోవైపు హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ తన కొడుకు చేసింది చాలా తప్పు అని ఒప్పుకున్నా.. ఒక్కడే ఇదంతా చేయలేదని.. దీని వెనుక ఉన్న  వారిని కూడా బయటికీ తీసుకురావాలని కోరాడు. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Ha త్య తరువాత ఈ విషయాన్ని నిందితుడు ఎవరెవరితో పంచుకున్నాడో వారిని విచారించే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్  మరణించిన తరువాత నిందితుడు హరిహరకృష్ణ బాడీ పార్ట్స్ ని బ్యాగులో వేసుకొని బ్రాహ్మణపల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. ఆ తరువాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి తన స్నేహితుడు హసన్ గదికి వెళ్లాడు. ఈ విషయాన్ని అతనికి చెప్పేశాడు. ఆ మరుసటి రోజునే తన ప్రియురాలికి కూడా ఈ విషయం గురించి తెలిపాడు. 

Also Read : టీ 20లో ఇంత  చెత్త రికార్డు కూడా నమోదవుతుందా ?

Advertisement

నవీన్  శరీర భాగాలను కట్ చేసి.. ఒక్కొక్కటిగా ఫోటోలు తీస్తూ తన ప్రియురాలుకి పంపించాడు హరిహరకృష్ణ. ముఖ్యంగా ఈ వేల్లే నా నిన్ను తాకింది అంటూ చేతి వేళ్లను.. ఈ పెదాలే కదా నిన్ను తాకింది అని పెదాలను.. ఈ గుండె కదా నిన్ను ప్రేమించింది అంటూ వాటన్నింటిని వేరు చేసి ఫోటోలను తీసి వాట్సాప్ లో పంపించాడు. వాటన్నింటిని చూసిన ఆ ప్రియురాలు ఏమనుకుందో ఏమో కానీ.. ఓకే గుడ్ బాయ్ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చి తేల్చేసింది. మరోవైపు నవీన్ ఫ్రెండ్ ఫోన్ చేసి హరిహరకృష్ణ ని వివరాలు అడిగినా ఏమాత్రం తెలియనట్టుగానే మాట్లాడినటువంటి ఆడియో ఒకటి బయటికి వచ్చింది.  

Also Read :  నిన్ను ప్రేమించిన వ్యక్తి గుండె ఇదేనా.. లవర్ కి పంపింతే ఏమందో తెలుసా ?

వీటన్నింటిని చూస్తుంటే ఇందులో ప్రియురాలు పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఈ అనుమానంతోనే పోలీసులు ఆమెను విచారించాలని ప్రయత్నించారు. కానీ ఆbu మాత్రం పోలీసులకు ట్విస్ట్ ఇచ్చింది. పోలీసులు ప్రశ్నించగా.. తనకు ఏం తెలియదు అని.. ఇందులోకి తనను లాగొద్దని.. ఒకవేళ బలవంతం చేస్తే తాను బలవన్మారణానికి పాల్పడుతానని కూడా వార్నింగ్ ఇచ్చింది.  హరిహరకృష్ణ పోలీసులకు లొంగిపోయే ముందు తెలివిగా తన ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని తీసేశాడు. ఇక అనుమానం వచ్చిన పోలీసులు హరిహరకృష్ణకి ప్రియురాలుకి మధ్య ఏం చాటింగ్ జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ముందముందు ఈ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి. 

Also Read :  టీ 20లో ఇంత  చెత్త రికార్డు కూడా నమోదవుతుందా ?

Visitors Are Also Reading