Home » నిన్ను ప్రేమించిన వ్యక్తి గుండె ఇదేనా.. లవర్ కి పంపింతే ఏమందో తెలుసా ?

నిన్ను ప్రేమించిన వ్యక్తి గుండె ఇదేనా.. లవర్ కి పంపింతే ఏమందో తెలుసా ?

by Anji

సాధారణంగా ప్రేమికులు ప్రేమించుకోవడం మనం చూస్తుంటాం. కానీ ప్రేమ కోసం మరో స్నేహితుడి ప్రాణాలు తీయడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఫ్రెండ్ ని చంపేసి గుండెను బయటికి తీసి.. ఆ ఫోటోను ప్రియురాలుకి పంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. స్నేహితుడిని తిరిగిరాని లోకాలకు పంపించిన  తరువాత లవర్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. 

వివరాల్లోకి వెళ్లితే.. నల్లగొండ జిల్లా ఎం.జీ.యూనివర్సిటీలో నవీన్, హరిహరకృష్ణ బీటెక్ చదువుతున్నారు. అదే యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతిని వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించారు. ఈ మధ్య ఎక్కువగా నవీన్ తో ఆ యువతి చనువుగా ఉండటంతో అతనిపై కక్ష పెంచుకున్నాడు.  హరి హరకృష్ణకి తన ప్రియురాలు దక్కదేమోనని అనుమానం కలిగింది. ఫిబ్రవరి 17, 2023న నవీన్ ని పార్టీ పేరుతో హైదరాబాద్ శివారు ప్రాంతం అయినటువంటి అబ్దుల్లాపూర్ మెట్ వద్దకు పిలిపించాడు. వీరిద్దరూ కలిసి Maద్యం సేవించారు. ఆ సమయంలో లవర్ టాఫిక్ రావడంతో మాట మాట పెరిగింది. క్షణిక ఆవేశంలో నవీన్ ని  హరి దారుణంగా చంపేశాడు. ఆ తరువాత అమ్మాయికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. నవీన్ ని చంపినట్టు వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు.. ఇదే అంటూ నవీన్ వేలును కోసి ఆ ఫోటో అమ్మాయికి పంపించాడు. 

Also Read :  తారకరత్నకు అలా కావడానికి కారణం.. తాత చేసిన ఆ పనేనా..?

 

ఈ పెదాలే కదా నిన్ను తాకింది అంటూ పెదాలను కూడా కోసి ఫోటో పంపించాడు. అదేవిధంగా గుండె, తల వేరు చేసి దూరంగా పడేశాడు. హరి హరకృష్ణ మెసేజ్ లను చదివిన అమ్మాయి జోక్ అనుకుందో లేక మరి ఏమనుకుందో తెలియదు.. ఓకే అంటూ రిప్లై ఇచ్చింది. మరోవైపు నవీన్ కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిహరకృష్ణ పై 302, 201, 3 (2) (వీ), ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు పోలీసులు.  ఇందులో ఆ యువతి పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. అయితే హరి నవీన్ ని చంపి శరీరం నుంచి తలను వేరు చేసినట్టు ఒప్పుకున్నాడు. ఆ తరువాత భాగాలుగా విభజించినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇక పోలీసులు నవీన్ మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టు మార్టానికి తరలించారు. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోతుందనే బాధతో నవీన్ ని హరి ప్లాన్ వేసి అంతమొందించాడని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొంటున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారనేది పూర్తి స్థాయి విచారణలో తేలనుంది.

Also Read :  పాలిటిక్స్ లోకి వెళ్తే jr:ఎన్టీఆర్ కు జరిగేది అదేనా..కారణం..!!

Visitors Are Also Reading