Home » మృగరాజు మూవీ కోసం బాలయ్యకు అన్యాయం చేశారా..కానీ చివర్లో బాలయ్య ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోలా..?

మృగరాజు మూవీ కోసం బాలయ్యకు అన్యాయం చేశారా..కానీ చివర్లో బాలయ్య ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోలా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ మొదలైనప్పటి నుంచి సంక్రాంతి వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద సినిమాల యుద్ధం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ మరియు చిరంజీవి అనేక సార్లు పోటీపడ్డారు. ఈ పోటీలో కొన్నిసార్లు చిరంజీవి నెగ్గితే మారికొన్నిసార్లు బాలకృష్ణ నెగ్గారు. తాజాగా వచ్చే సంక్రాంతికి మరోసారి ఈ ఇద్దరు టాప్ హీరోలు సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. మరి ఇందులో ఎవరు హిట్ అవుతారో ఎవరు ఫట్ అవుతారనేది ముందు ముందు తెలుస్తుంది. కట్ చేస్తే 2001లో సంక్రాంతికి పెద్ద యుద్ధమే జరిగింది. ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో పోటీపడ్డాయి.

Advertisement

 

 

also read:ఫ్లిప్ కార్ట్ ఆఫర్ అదుర్స్: 16 వేల రూ”ఫోన్ ఆఫర్ లో 599కే ..!!

Advertisement

జనవరి 11వ తేదీన బాలయ్య నరసింహనాయుడు, చిరంజీవి మృగరాజు,14న వెంకటేష్ దేవి పుత్రుడు విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాల్లో మృగరాజు డిజాస్టర్ గా నిలిస్తే, వెంకటేష్ దేవి పుత్రుడు యావరేజ్ గా నిలిచింది. ఇక ఇందులో బాలయ్య నరసింహనాయుడు బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కానీ ఈ సమయంలో బాలకృష్ణ కి తీవ్ర అన్యాయం జరిగిందట. అదేంటయ్యా అంటే.. బాలకృష్ణ నరసింహనాయుడు సినిమాకి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల కేవలం 14 థియేటర్లు మాత్రమే ఇచ్చారట. ఇక మిగిలిన మెజారిటీ థియేటర్లన్నీ చిరంజీవి మృగరాజు సినిమాకి మిగతావి వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాకు ఇచ్చారట.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ చాలా బాధపడ్డారని , కానీ రెండు రోజులు గడిచేసరికి దేవిపుత్రుడు మృగరాజు సినిమాలు బోల్తా పడ్డాయని బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా మాత్రం సక్సెస్ఫుల్గా దూసుకుపోవడంతో మళ్లీ ఈ చిత్రానికే థియేటర్ లన్ని ఇచ్చారట. దీంతో సినిమా 175 నుంచి 200 రోజుల వరకు ఆడి బంపర్ లాభాలు తెచ్చి పెట్టిందట. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 200 రోజులకు పైగా ఆడి రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు.

also read:

Visitors Are Also Reading